ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి | RTC bus hit the woman died | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Mar 9 2016 11:20 AM | Updated on Aug 30 2018 4:07 PM

కూలి పనులకు సైకిల్ పై వెళ్తున్న భార్యా భర్తలను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో మహిళ మృతి చెందింది.

కూలి పనులకు సైకిల్ పై వెళ్తున్న భార్యా భర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద బుధవారం చోటుచేసుకుంది.

మంగళాపురం గ్రామానికి చెందిన కొల్లూరి వీరయ్య, రాధ దంపతులు లక్ష్మీపురం వద్ద కూలి పనులకు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో రాధ అక్కడికక్కడే మృతిచెందగా.. వీరయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement