ఆర్టీసీ డ్రైవర్ మృతికి సిబ్బంది శ్రద్ధాంజలి | RTC bus driver passed away in passenger attack on thursday | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్ మృతికి సిబ్బంది శ్రద్ధాంజలి

Apr 24 2015 5:44 PM | Updated on Sep 3 2017 12:49 AM

ఆర్టీసీ డ్రైవర్ మృతికి సిబ్బంది శ్రద్ధాంజలి

ఆర్టీసీ డ్రైవర్ మృతికి సిబ్బంది శ్రద్ధాంజలి

హిందూపూర్‌లో గురువారం చనిపోయిన ఆర్‌టీసీ డ్రైవర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ హిందూపూర్ డిపో సిబ్బంది భావపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ ర్యాలీ నిర్వహించారు.

అనంతపురం(హిందూపురం): హిందూపూర్‌లో గురువారం చనిపోయిన ఆర్‌టీసీ డ్రైవర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ హిందూపూర్ డిపో సిబ్బంది భావపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఓ ప్రయాణికుడికి, ఆర్టీసీ డ్రైవర్ ఆంజనేయులుకు మధ్య గొడవ చినికి చినికి పెద్దదై చంపుకొనే వరకు వెళ్లిన సంగతి తెల్సిందే.

బస్సు డ్రైవర్కు ప్రయాణీకుడికి మధ్య ఘర్షణ చోటుచేసుకొని డ్రైవర్ మృతి చెందాడు. గురువారం ఉదయం మద్యం మత్తులో నారాయణప్ప అనే ప్రయాణీకుడు డ్రైవర్ ఆంజనేయులుతో గొడవపడ్డాడు. అనంతరం ఇరువరు ఘర్షణకు దిగగా నారాయణప్ప చేసిన దాడిలో డ్రైవర్ ఆంజనేయులు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు నారాయణప్పను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement