ప్రైవేటు దందాపై ఆర్టీఏ కొరడా | RTA seized 6 buses in vizayawada | Sakshi
Sakshi News home page

ప్రైవేటు దందాపై ఆర్టీఏ కొరడా

Jan 13 2015 9:05 AM | Updated on Sep 2 2017 7:39 PM

ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు మరోసారి కొరడా ఝళిపించారు.

విజయవాడ: ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు మరోసారి కొరడా ఝళిపించార. ఆంధ్రప్రదేశ్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై దాడులు నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణ చార్జీలు రెండింతలు, మూడింతలుగా వసూళ్లు చేయడంతో పాటు రవాణాశాఖ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ప్రైవేట్ ట్రావెల్స్లపై ఆర్టీఏ అధికారులు మళ్లీ దాడులు చేశారు.

విజయవాడ, గరికపాడు చెక్పోస్ట్ వద్ద ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేసిన 6 ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement