కడప జిల్లాలో రూ. కోటి ఎర్రచందనం స్వాధీనం | Rs. One crore worth red sandalwood seized in ysr kadapa district | Sakshi
Sakshi News home page

కడప జిల్లాలో రూ. కోటి ఎర్రచందనం స్వాధీనం

Jun 9 2015 4:21 PM | Updated on Oct 4 2018 6:03 PM

కడప జిల్లాలో వాగేటికోన వద్ద శేషాచల అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు.

కడప: కడప జిల్లాలో వాగేటికోన వద్ద శేషాచల అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులకు ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురుపడ్డారు. దాంతో స్మగ్లర్లు... అధికారులపైకి రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు స్మగ్లర్లపై కాల్పులు జరిపారు.

దీంతో స్మగ్లర్లు పరారైయ్యరు. తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. కోటి ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement