రైతులకు రూ.96 కోట్ల హుద్‌హుద్‌ పరిహారం | Rs .96 crore hudood compensation for farmers | Sakshi
Sakshi News home page

రైతులకు రూ.96 కోట్ల హుద్‌హుద్‌ పరిహారం

May 3 2017 3:11 AM | Updated on Sep 5 2017 10:13 AM

రైతులకు రూ.96 కోట్ల హుద్‌హుద్‌ పరిహారం

రైతులకు రూ.96 కోట్ల హుద్‌హుద్‌ పరిహారం

హుద్‌హుద్‌ తుఫాన్‌ నష్టపరిహారం కింద జిల్లాలోని రైతులకు రూ.96 కోట్లను అందజేసినట్టు జిల్లా రిలీఫ్‌ అకౌంట్స్‌ సహాయ ఆడిట్‌ అధికారి ఎం.స్వాతి తెలిపారు.

మందస(పలాస) :హుద్‌హుద్‌ తుఫాన్‌ నష్టపరిహారం కింద జిల్లాలోని రైతులకు రూ.96 కోట్లను అందజేసినట్టు జిల్లా రిలీఫ్‌ అకౌంట్స్‌ సహాయ ఆడిట్‌ అధికారి ఎం.స్వాతి తెలిపారు. మందస మండలానికి సంబంధించిన హుద్‌హుద్‌ పరిహారం నిధుల పంపిణీ వ్యవహారంపై మంగళవారం తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయానికి రూ.86 కోట్లు, ఉద్యానవనానికి సంబంధించి రూ.10 కోట్లను రైతులకు ఇప్పటికే అందజేశామన్నారు.

మందస మండలంలో 38 పంచాయతీల్లోని 147 మంది రైతులకు రూ.2.5 లక్షలు పంపిణీ చేశామని వివరించారు. ఈ నిధులు రైతులకు చేరాయా.. అక్రమాలు జరిగాయా.. అనే అంశాలపై ఆడిట్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు ఆడిట్‌ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఆమెతో పాటు మందస ఏఎస్‌ఓ బి.భోగేశ్వరరావు, వీఆర్వోలు నల్ల వైకుంఠరావు, రవీంద్రనాథ్‌ పట్నాయక్‌లు రికార్డులను పరిశీలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement