ఎక్సైజ్ సీఐ లాకర్‌లో రూ.10 లక్షల సొత్తు | Rs 10 lakh property locker few weeks | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ సీఐ లాకర్‌లో రూ.10 లక్షల సొత్తు

Feb 6 2014 2:24 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చిక్కిన ఎక్సైజ్ సీఐ యామల జయరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌లో రూ.10 లక్షల సొత్తును ఏసీబీ అధికారులు

రాజమండ్రి రూరల్ (తూర్పు గోదావరి), న్యూస్‌లైన్ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చిక్కిన ఎక్సైజ్ సీఐ యామల జయరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌లో రూ.10 లక్షల సొత్తును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉయ్యూరు ఎక్సైజ్ సీఐ జయరాజుకు చెందిన రాజమండ్రి గణేష్‌నగర్‌లోని ఇంటితో పాటు మరో 8 చోట్ల ఏకకాలంలో దాడులు చేసిన విషయం విదితమే.

ఈ దాడుల్లో రూ.2 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. అతడి ఇంట్లో దొరికిన తాళంతో గురువారం రాజమండ్రి అల్కాట్‌తోట ఆంధ్రాబ్యాంక్ బ్రాంచిలోని లాకర్‌ను ఏలూరు ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది తెరిపించారు. అందులో రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులున్నట్టు గుర్తించారు. వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జయరాజును విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్టు డీఎస్పీ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement