వేదికపై అశోక్‌బాబు.. వెనుదిరిగిన చలసాని | Round table meeting on Special Category Status in Vijayawada | Sakshi
Sakshi News home page

వేదికపై అశోక్‌బాబు.. వెనుదిరిగిన చలసాని

Apr 4 2018 1:43 PM | Updated on Jul 24 2018 1:12 PM

Round table meeting on Special Category Status in Vijayawada - Sakshi

చలసాని శ్రీనివాస్‌, అశోక్‌బాబు

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఏపీజేఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.  విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌తో పాటు ఎపీఎన్జీవో నేత అశోక్‌బాబు తదితరులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ క్రమంలో సమావేశానికి వచ్చిన చలసాని, వేదికపై ఉన్న అశోక్‌బాబును చూసి సమావేశంలో పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో నిర్వాహకులు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. హోదా ఉద్యమాన్ని కొందరు నీరుగారుస్తున్నారని ఈ సందర్భంగా చలసాని నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చిన వ్యక్తులే.. మళ్లీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉపయోగించుకునే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement