విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident Took Place At Vizianagaram District | Sakshi
Sakshi News home page

20 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

Jun 25 2019 1:59 PM | Updated on Jun 25 2019 2:05 PM

Road Accident Took Place At Vizianagaram District - Sakshi

సాక్షి, విజయనగరం : జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుంచి పార్వతిపురం వెళ్తొన్న ఆర్టీసీ బస్సును ఒడిషా నుంచి వస్తోన్న లారీ నెల్లివాడ బ్రిడ్జీపై ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో బొండపల్లి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌తో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని విజయనగరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు గాయపడిన వారికి సహయం అందించేలా చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement