చౌక బియ్యంతో దొరికిపోయారు | Rice mills attacked and seized Rs .8.38 lakh rice vigilance | Sakshi
Sakshi News home page

చౌక బియ్యంతో దొరికిపోయారు

Dec 29 2013 4:45 AM | Updated on Sep 2 2017 2:04 AM

రైస్‌మిల్లుపై దాడి చేసి రూ.8.38 లక్షల బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. మండలంలోని చింతచెలికలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

కొడవలూరు, న్యూస్‌లైన్: రైస్‌మిల్లుపై దాడి చేసి రూ.8.38 లక్షల బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. మండలంలోని చింతచెలికలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. విజిలెన్స్ డీఎస్పీ రమేష్‌బాబు వివరాలు వెల్లడించారు. విజిలెన్స్ ఎస్పీ సి.శశిధర్‌రాజు ఆదేశాల మేరకు లక్ష్మీతేజ రైస్‌మిల్లుపై దాడి చేశామన్నారు. మిల్లులో 191 క్వింటాళ్ల చౌకబియ్యాన్ని  ఇతర బస్తాల్లోకి మార్చుతుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు.

అలాగే మిల్లులో ఉన్న 4.18 లక్షల ఇతర బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు రమేష్‌బాబు చెప్పారు. మొత్తం రూ.8.38 లక్షల బియ్యాన్ని సీజ్ చేశామన్నారు. చౌకబియ్యాన్ని సివిల్ సప్లయిస్ కు అప్పగించామని, ఇతర బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 6ఏ కేసు నమోదు చేశామని తెలిపారు. దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు సంగమేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, డీటీ వెంకటేశ్వరరావు, ఏఓ ధనుంజయరెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement