
గిరిజనులకు అన్యాయం జరిగితే సహించం
గిరిజనులకు అన్యాయం జరిగితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని జాతీయ ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్ రవిఠాకూర్ పేర్కొన్నారు.
► జాతీయ ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్ రవిఠాకూర్
► ఎన్‌కౌంటర్‌పై అధికారులతో సమీక్ష
► రవిఠాకూర్‌కు వివరించిన ఉన్నతాధికారులు
తిరుపతి తుడా : గిరిజనులకు అన్యాయం జరిగితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని జాతీయ ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్ రవిఠాకూర్ పేర్కొన్నారు. ఈ నెల 7న తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఎస్టీలపై ఆయన సంబంధిత అధికారులతో ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జట్టి, డీఎఫ్‌వో శ్రీనివాసులు, టాస్క్‌ఫోర్స్ ప్రతినిధి బీఎన్ మూర్తి, ఆర్డీవో వీరబ్రహ్మయ్య హాజరయ్యారు. ఎన్‌కౌం టర్‌లో చనిపోయిన ఎస్టీల తెగలకు చెం దినవారి కుటుంబాల ఫిర్యాదుల మేరకు అధికారులను ప్రశ్నల వర్షం కురిపించి నట్టు సమాచారం.
ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై ఆయన ఆరాతీశారు. కూలీలు రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టారని ఆరా తీశారు. బాధిత కుటంబాలను త మిళనాడు, ఏపీల నుంచి ఎలాంటి సహా యం అందించాలనే విషయంపై చర్చిం చారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు రవిఠాకూర్ ప్రశ్నలకు కూలంకుషంగా వివరాలు చెప్పినట్టు తెలసింది. ఇప్పటి వరకు దాదాపుగా 10వేల మందిని అరె స్టు చేసినట్టు ఎస్పీ గోపినాథ్‌జట్టి చెప్పా రు. శేషాచలం ప్రాంతంలో ప్రవేశం నిషేధం ఉందని, ఎర్రచందనం స్మగ్లింగ్ పాల్పడితే చర్యలు ఉంటాయని తమిళనాడు ప్రాంతంలో ప్రచారం చేసినట్టు వివరించినట్టు సమాచారం.
డీఎఫ్‌వో శ్రీనివాసులు వివరిస్తూ గతంలో ఎర్ర స్మగ్లర్‌లు, కూలీలు ఫారెస్ట్, పోలీసులపై దాడులక ు తెగబడ్డారని వివరించారు. అధికారులు వారి దాడుల్లో చనిపోయిన సంఘటలను వివరించారు. అప్పటి పే పర్ కటింగ్‌లను ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్‌కు చూపించారు. ఎర్ర కూలీలు రాకుండా చేపట్టిన చర్యలను వివరించారు. కూలీలు రాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు రవిఠాకూర్ ఆదేశించారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ ధనంజయరావు, గిరిజన సంక్షేమాధికారి కృష్ణానాయక్ పాల్గొన్నారు.