కాశీ యాత్రకు వెళ్లొస్తుండగా విషాదం.. | return to kasi accident | Sakshi
Sakshi News home page

కాశీ యాత్రకు వెళ్లొస్తుండగా విషాదం..

May 9 2016 10:39 AM | Updated on Apr 3 2019 7:53 PM

కాశీ యాత్రకు వెళ్లొస్తున్న ఓ భక్త బృందం ప్రమాదం బారిన పడింది. వారు ప్రయాణిస్తున్న బస్సు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం ఇజ్జలూరి జంక్షన్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది.

 
 
మారేడుపల్లి:  కాశీ యాత్రకు వెళ్లొస్తున్న ఓ భక్త బృందం ప్రమాదం బారిన పడింది. వారు ప్రయాణిస్తున్న బస్సు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం ఇజ్జలూరి జంక్షన్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో చింతగింజల విజయ (50) అనే మహిళ తీవ్ర గాయాలతో మృతి చెందింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు, 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
 
వారిని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, శ్రీరామ్‌పూర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 47 మంది గత నెల 29వ తేదీన కాశీయాత్రకు బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం అన్నవరం చేరుకుని సత్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున భద్రాచలం బయల్దేరారు. ఇజ్జలూరు జంక్షన్ సమీపంలో మలుపులో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement