ఏపీ ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగరాజ్‌

Retired Judge Justice Kanagaraj To Be Appointed As AP SEC - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నూతన ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజ్‌ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ జడ్జిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిన్న (శుక్రవారం) ఆర్డినెన్స్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా ప్రభుత్వం నియమించింది.

తమిళనాడుకు చెందిన జస్టిస్‌ కనగరాజ్ మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ కనగరాజ్ 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా అనేక కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చారు. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్‌గా ఆయన వ్యవహరించారు. 2006లో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.
(చదవండి: రాష్ట్ర ఈసీగా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి)

మర్యాద పూర్వక భేటీ..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన సందర్భంగా జస్టిస్‌ కనగరాజ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top