బాబుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ల లేఖ

Retaired IAS Officers Have Written A Letter To Chandrababu Over His Comments On LV Subrahmanyam - Sakshi

అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై రిటైర్డ్‌ ఐఏఎస్‌లు లేఖ సంధించారు. ఏపీ ప్రభుత్వ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌లపై చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై వాడిన భాష సరికాదంటూ హితవు పలికారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం నిబద్ధత గల అధికారి అని కొనియాడారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని హైకోర్టు తేల్చిన విషయాన్ని గుర్తు చేశారు.

అలాగే ఏపీ సీఈఓ గోపాల కృష్ణ ద్వివేదిపై చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. చంద్రబాబు వెంటనే ఐఏఎస్‌లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  ఈ మేరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌లు శ్రీపాద భలే రావు, కేవీరావు, టీఎస్‌ అప్పారావు, ఏకే పరీదా, ఎస్‌కే సిన్హా, సుతీంద్ర భట్టాచార్య, విద్యాసాగర్‌, ఎంజీ గోపాల్‌, సీవీఎస్‌కే శర్మ తదితరులు లేఖలో బాబు తీరును తప్పుబట్టారు.

మా జోలికి వస్తే ఊరుకోం
ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని ఉద్యోగ సంఘాల సమాఖ్య కన్వీనర్‌ వెంకట్రామి రెడ్డి చెప్పారు. సీఎం చంద్రబాబు వెంటనే చీఫ్‌ సెక్రటరీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారులు, ఉద్యోగుల జోలికొస్తే ఊరుకోమని హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top