బ్రిజేశ్‌కుమార్ తీర్పుపై స్పందించాలి | respond on brijes kumar Judgment | Sakshi
Sakshi News home page

బ్రిజేశ్‌కుమార్ తీర్పుపై స్పందించాలి

Dec 3 2013 4:18 AM | Updated on Aug 29 2018 4:16 PM

కృష్ణానది జలాల పంపకంపై బ్రిజేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పుపై అధికార పక్షం స్పం దించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నం ద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు.

 నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్:  కృష్ణానది జలాల పంపకంపై బ్రిజేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పుపై అధికార పక్షం స్పం దించాలని   సీపీఎం జిల్లా కార్యదర్శి నం ద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రిజేశ్‌కుమార్ తీర్పు వల్ల రాష్ట్రానికి నష్టం జరగుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరిన్ పీడత ప్రాంతంగా ఉన్న నల్లగొండ జిల్లాకు తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులు పూర్తిగా ఉత్సవ విగ్రహాలుగా మిగులుతాయన్నారు.

తాగునీరు కూడ లభించని పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహరాష్ట్రలోని ప్రాజెక్టులు నిండితేనే రాష్ట్రానికి నీరొచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో సాగర్ ఆయకట్టులో ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు ఆలస్యమై దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. రాష్ట్రానికి జీవనదిగా ఉన్న కృష్ణానది జలాలపై ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడంతోనే నష్టం జరిగిందన్నారు. ఈ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చిం చేందుకు ప్రభుత్వం అఖిలపక్షం సామావేశం ఏర్పాటు చేయాలని, వారిని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ తీర్పుపై అధికార పక్షం నాయకులు నోరుమెదకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా స్పందించాలని కోరారు. ఆయన వెంట  సీపీఎం కార్యదర్శీ వర్గ సభ్యుడు అనంతరామశర్మ, తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement