అంతా టౌన్‌ప్లానింగ్ | Report requested by the Municipal Commissioner | Sakshi
Sakshi News home page

అంతా టౌన్‌ప్లానింగ్

May 16 2015 4:29 AM | Updated on Oct 16 2018 6:08 PM

శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్ సెగ కార్పొరేషన్‌లోని టౌన్‌ప్లానింగ్‌నూ తాకింది...

- లేఅవుట్ రిలీజ్‌లో పైరవీలు
- ప్రిన్సిపల్ సెక్రటరీ సి‘ఫార్సు’లపై చర్చ
- నివేదిక కోరిన మున్సిపల్ కమిషనర్
- అధికారుల వైఖరిపై సీరియస్
విజయవాడ సెంట్రల్ :
శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్ సెగ కార్పొరేషన్‌లోని టౌన్‌ప్లానింగ్‌నూ తాకింది. ఈ విషయంలో కొందరు అధికారుల వైఖరిపై మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ సీరియస్‌గా ఉన్నారు. వివాదాస్పదంగా మారిన ఈ ఫైల్‌పై ఆయన నివేదిక కోరారు. దీనిపై గురువారం రాత్రి 10 గంటల వరకు బంగ్లాలో సిటీప్లానర్ ఎస్.చక్రపాణితో ఆయన చర్చించినట్టు సమాచారం. పెద్దమొత్తంలో ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు భుజాలు తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేఅవుట్ రిలీజ్‌కు సంబంధించి ఎన్జీవో సంఘ మాజీనేత పైస్థాయిలో పైరవీ సాగించారనే బలమైన ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీతో లేఅవుట్ రిలీజ్ చేయమని సి‘ఫార్సు’ ఇచ్చినట్టు తెలిసింది.

అసలు ఫైల్ కౌన్సిల్‌కు ఎందుకు వచ్చినట్టు?
శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ 1982లో 12.96 ఎకరాల్లో ఇళ్ల ప్లాట్లు వేసి సొసైటీ సభ్యులకు రిజిస్టర్ చేసి ఇచ్చింది. 1994లో సొసైటీ సభ్యులు యూఎల్పీ నంబర్ 3/94పై లేఅవుట్ పొందారు. దీని ప్రకారం నగరపాలక సంస్థకు పదిశాతం ఖాళీ స్థలాన్ని అప్పగించాలి. అయితే, నిబంధనలకు విరుద్ధంగా పదిశాతం స్థలంలో 16.5 సెంట్లు (798 చ.గ.) ఇళ్ల ప్లాట్లుగా విభజించి విక్రయాలు సాగించారు. దీంతో లేఅవుట్ రెగ్యులరైజేషన్‌కు బ్రేక్ పడింది. ఈ తగ్గిన స్థలాన్ని.. ప్లాట్ యజమానులు ఇంటి ప్లాన్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడు నగదు రూపంలో చెల్లించాలని, అలాగే, రోడ్డు ఫార్మెట్ ఖర్చులు, మాస్టర్‌ప్లాన్ ప్రకారం బిల్డింగ్ ప్లాన్ అప్లయ్ చేసినపుడు 40 అడుగుల రోడ్డుకు ఇరువైపులా మూడున్నర అడుగుల వెడల్పు చొప్పున వదిలేస్తే లేఅవుట్ రిలీజ్ చేస్తామని గత జనవరి 17న సొసైటీకి ఎండార్స్‌మెంట్ ఇచ్చారు.

ఫిబ్రవరి 9న జరిగిన కౌన్సిల్‌లో ఈ అంశం ప్రస్తావనకు రాలేదు. ఈనెల 7న జరిగిన కౌన్సిల్‌లో ఆఖరి క్షణంలో ప్రత్యక్షమై పాలక, ప్రతిపక్ష సభ్యుల్ని గందరగోళానికి గురిచేసింది. నగరంలో మిగిలిన లేఅవుట్లకు ఇవ్వని వెసులుబాటు ఈ సొసైటీకి ఎందుకు ఇచ్చారన్నది ప్రశ్న. పదిశాతం స్థలం తగ్గితే లేఅవుట్ అంశం కౌన్సిల్‌కు వచ్చిన సందర్భం లేదని సీనియర్ రాజకీయవేత్తలు చెబుతున్నారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారుల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి.

నేడు వైఎస్సార్ సీపీ స్థల పరిశీలన
సొసైటీ భూములను పరిశీలించి వాస్తవాలు తేల్చాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు నిర్ణయించారు. ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు నగరంలోని శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ స్థలాన్ని పరిశీలించనున్నారు. కౌన్సిల్‌లో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే అదనపు కమిషనర్‌కు వారు వినతిపత్రం సమర్పించారు.

ఏ విచారణకైనా సిద్ధం
లేఅవుట్ రిలీజ్ వ్యవహారంలో అవకతవకలు జరగలేదని శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు బి.నారాయణరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అంశాలను పూర్తిచేసి కాలనీని అభివృద్ధి చేశామన్నారు. రూ.20 కోట్ల విలువైన స్థలాన్ని నగరపాలక సంస్థకు అప్పగించామని చెప్పారు. తాము ఎవరికీ ముడుపులు ఇవ్వలేదని, దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement