తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా జామి మండలం వెల్లెపాడు గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 50 ఎర్ర చందనం దుంగలను గుర్తించిన పోలీసులు బుధవారం తెల్లవారుజామున వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ. కోటి పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ దుంగలను ఎవరు తరలిస్తున్నారు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.