
కాకినాడ : నవరత్న పథకాలు పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని రావాలి జగన్–కావాలి జగన్‌లో పార్టీనేతలు ప్రజలకు వివరించారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమాల్లో ఆయా నియోజక వర్గ కో ఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు.
రాజమహేంద్రవరం సిటీలో : రాజమహేంద్రవరం సిటీ 42వ డివిజన్ శ్రీరామ్‌నగర్‌లో కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు.
ముమ్మిడివరంలో: ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చినబాపనపల్లిలో కో–ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్ కుమార్ రావాలి జగన్–కావాలి జగన్‌లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.
పి.గన్నవరంలో: పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ముక్కామలలో కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమంలో నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు.
రాజోలులో: రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు రావాలి జగన్– కావాలి జగన్‌లో రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రామచంద్రపురంలో: రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం సుందరపల్లిలో కో–ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రావాలి జగన్–కావాలి జగన్‌లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వారికి భరోసా ఇచ్చారు.
రాజమహేంద్రవరం రూరల్‌లో: రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని 28వ డివిజన్‌లో కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు.
రంపచోడవరంలో: అడ్డతీగల మండలం బొట్లంకలో రంపచోడవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ నాగులాపల్లి ధనలక్ష్మి రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) పాల్గొన్నారు.
జగ్గంపేటలో: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం వేగాయమ్మపేటలో కో–ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు రావాలి జగన్–కావాలి జగన్ నిర్వహించారు.
ప్రత్తిపాడులో: నియోజకవర్గ కోఆర్డినేటర్ పర్వత ప్రసాద్ ఆధ్వర్యంలో రావాలి జగన్– కావాలి జగన్‌లో భాగంగా ప్రత్తిపాడులో పర్యటించి తెలుగు దేశం ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ నవరత్న పథకాలను ప్రజలకు
వివరించారు.