ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం | rape on six years baby | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

Feb 23 2014 3:29 AM | Updated on Jul 28 2018 8:51 PM

అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్ ఎం.హుస్సేన్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం....

  చాంద్రాయణగుట్ట, : అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్ ఎం.హుస్సేన్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం....శంషీర్‌గంజ్ కాల్వగడ్డకు చెందిన నర్సింహ్మా (25) గోల్డ్‌స్మిత్. కాగా ఇతని పక్కింట్లోనే ఉంటున్న ఆరేళ్ల చిన్నారిపై అతడి కన్ను పడింది. శుక్రవారం సాయంత్రం చిన్నారిని ఇంట్లోకి పిలిపించుకున్నాడు.

 

అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్ది సేపటి అనంతరం చిన్నారి విషయాన్ని తల్లికి తెలిపింది. దీంతో తల్లిదండ్రులు శుక్రవారం అర్ధరాత్రి ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితునిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement