‘కరోనాతో యుద్ధంలో ప్రభుత్వానికి సహకరించండి’

BY Ramaiah And MP Sanjeev Kumar Talks In Press Meet Over Lockdown In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కోనసాగుతున్నప్పటికీ సంక్షేమ పథకాలు ఎక్కడా అటంకం లేకుండా సమర్థవంతంగా కొనసాగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేత బీవై రామయ్య అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. అంతేగాక వార్డు వాలంటీర్ల వ్యవస్థ కూడా దేశవ్యాప్తంగా ఆదర్శవంతంగా అమలవుతున్నాయన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ముందుందని ఆయన అన్నారు. (లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. వీడియో కాల్‌లో పెళ్లి)

ఎంపీ సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని, మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గం అన్నారు. కరోనాపై యుద్దంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ మాట్లాడుతూ.. కరోనాపై పోరాటంలో పేదలకు ఎలాంటి కష్టం రాకుండా సీఎం జగన్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. రేషన్‌, వృద్దాప్య పింఛన్లు కూడా ఇంటి వద్దనే అందించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే హఫీజ్‌ మాట్లాడుతూ.. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కరోనా అన్నది కులమతాలకు అతీతమైనదని సోషల్‌ మీడియోలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మోద్దని సూచించారు. (మోదీ పిలుపు; నిద్రొస్తే నిద్రపోతా : మమతా)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top