వైఎస్ఆర్ జిల్లా రాజంపేట ఎంపీపీ సుహర్లతపై అనర్హత వేటు పడింది.
వైఎస్ఆర్ జిల్లా రాజంపేట ఎంపీపీ సుహర్లతపై అనర్హత వేటు పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సుహర్లత, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. దాంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని పార్టీ నాయకుడు ఆకేపాటి మురళీరెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీ పదే పదే పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి దూకడం స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువగా కనిపించింది.