రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు | Rains with in 24 hours in Andhra Pradesh, Telangana states, | Sakshi
Sakshi News home page

రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు

Jul 22 2014 10:16 AM | Updated on May 3 2018 3:17 PM

రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు - Sakshi

రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు

ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కదులుతుందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కదులుతుందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడకక్కడ తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

 

కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాని తుపాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement