కోస్తాలో చెదురుమదురు వర్షాలు | Sakshi
Sakshi News home page

కోస్తాలో చెదురుమదురు వర్షాలు

Published Sat, Nov 8 2014 9:50 AM

Rains likely in Coastal Andhra Pradesh

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. విశాఖకు ఆగ్నేయంగా 510 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఈ సాయంత్రానికి వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. కోస్తాంధ్రలోని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని వెల్లడించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
 

Advertisement
Advertisement