విజయవాడ రైల్వే ఎస్పీపై సస్పెన్షన్ వేటు | Railway stations on the suspension dropped SP | Sakshi
Sakshi News home page

విజయవాడ రైల్వే ఎస్పీపై సస్పెన్షన్ వేటు

Nov 12 2014 1:42 AM | Updated on Sep 2 2017 4:16 PM

విజయవాడలో రైల్వే ఎస్పీగా పని చేస్తున్న ఐపీఎస్ అధికారి సీహెచ్ శ్యామ్‌ప్రసాద్‌రావుపై సస్పెన్షన్ వేటు పడింది.

హైదరాబాద్: విజయవాడలో రైల్వే ఎస్పీగా పని చేస్తున్న ఐపీఎస్ అధికారి సీహెచ్ శ్యామ్‌ప్రసాద్‌రావుపై సస్పెన్షన్ వేటు పడింది. సీఐడీ నివేదిక ఆధారంగా ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఇన్‌చార్జ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం తెలిపారు

. ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ)లో అవకతవకలకు పాల్పడినట్లు శ్యామ్‌ప్రసాద్‌రావుపై సీఐడీ క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అవక తవకలకు పాల్పడినట్లు తేలడంతో ఇటీవల అందిన నివేదిక ఆధారంగా శ్యామ్‌ప్రసాద్‌రావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement