breaking news
Railway SP
-
'నేను ఎవరినీ వేధించలేదు'
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే జిల్లా ఎస్పీ జనార్దన్‌పై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బాబూరావు, డీజీపీ కార్యాలయంలో ఏఓగా విధులు నిర్వర్తిస్తున్న మల్లికను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. కనకదుర్గ అనే మహిళ రైల్వే ఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పని చేస్తున్నారు. ఈ ఏడాది జూలైలో బాబూరావు, మల్లిక సమక్షంలో ఎస్పీ జనార్దన్ ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించారని, ఆమెను ముగ్గురూ కలిసి బెదిరించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై ఇప్పటికే శాఖాపరమైన విచారణ జరుగుతోంది. తనపై జరిగిన నేరానికి సంబంధించి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయట్లేదని కనకదుర్గ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జీఆర్పీ పోలీసులు సెక్షన్ 354, 506, R/W 34 కింద గురువారం కేసు నమోదు చేశారు. కక్ష తోనే... ఈ విషయంపై ఎస్పీ జనార్థన్ వివరణ ఇస్తూ ‘11 నెలలుగా రైల్వే ఎస్పీగా పని చేస్తున్నా. కనకదుర్గ కనీసం ఒక్కరోజు కూడా నా ఆధీనంలో పని చేయలేదు. ఇక వేధింపుల సమస్య ఎలా ఉత్పన్నం అవుతుంది? ఆమె నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో ఉద్యోగంలో చేరినట్లు సమాచారం అందింది. ఈ మేరకు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించాను. ఆ కక్షతోనే తప్పుడు ఫిర్యాదు చేశారు. అంతేకానీ నేనెవర్నివేధించలేదు. విచారణలో పోలీసులకు సహకరిస్తా’నన్నారు. -
మహిళా ఉద్యోగిపై వేధింపులు.. రైల్వే ఎస్పీపై కేసు
సికింద్రాబాద్: ఓ మహిళా ఉద్యోగికి ఉన్నతాధికారి నుంచి లైంగిక వేధింపులు తప్పడం లేదు. దీంతో తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశించడంతో సికింద్రాబాద్ రైల్వే ఎస్పీపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సెక్షన్ 354, 506, ఆర్/డబ్ల్యూ 34 కింద వేధింపులకు పాల్పడ్డ రైల్వే ఎస్పీపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. -
విజయవాడ రైల్వే ఎస్పీపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: విజయవాడలో రైల్వే ఎస్పీగా పని చేస్తున్న ఐపీఎస్ అధికారి సీహెచ్ శ్యామ్‌ప్రసాద్‌రావుపై సస్పెన్షన్ వేటు పడింది. సీఐడీ నివేదిక ఆధారంగా ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఇన్చార్జ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం తెలిపారు . ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ)లో అవకతవకలకు పాల్పడినట్లు శ్యామ్‌ప్రసాద్‌రావుపై సీఐడీ క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అవక తవకలకు పాల్పడినట్లు తేలడంతో ఇటీవల అందిన నివేదిక ఆధారంగా శ్యామ్‌ప్రసాద్‌రావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.