రాహుల్‌ సభ వేదిక మార్పు | Rahul Sabha Venue changed | Sakshi
Sakshi News home page

రాహుల్‌ సభ వేదిక మార్పు

May 30 2017 1:40 AM | Updated on Sep 5 2017 12:17 PM

రాహుల్‌ సభ వేదిక మార్పు

రాహుల్‌ సభ వేదిక మార్పు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం జూన్‌ 4న అన్ని రాజకీయ పక్షాలతో గుంటూరులో ‘ప్రత్యేక హోదా–ఆంధ్రుల హక్కు’ నినాదంతో సభ నిర్వహిస్తున్నట్లు పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి చెప్పారు.

భీమవరం నుంచి గుంటూరుకు మార్చినట్లు రఘువీరా వెల్లడి  
 
కాకినాడ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం జూన్‌ 4న అన్ని రాజకీయ పక్షాలతో గుంటూరులో ‘ప్రత్యేక హోదా–ఆంధ్రుల హక్కు’ నినాదంతో సభ నిర్వహిస్తున్నట్లు పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి చెప్పారు. ఈ సభను తొలుత భీమవరంలో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ వివిధ కారణాల వల్ల వేదికను గుంటూరుకు మార్చినట్లు తెలిపారు.

సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్, జేడీఏ, డీఎంకే సహా పలు పార్టీల నేతలు  హాజరు కానున్నారని రఘువీరా చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement