‘మైనార్టీ మంత్రిలేని కేబినెట్ ఆ ప్రభుత్వనీదే’ | Raghuveera reddy criticized tdp government | Sakshi
Sakshi News home page

‘మైనార్టీ మంత్రిలేని కేబినెట్ ఆ ప్రభుత్వనీదే’

Jun 23 2017 8:04 PM | Updated on Oct 16 2018 6:01 PM

‘మైనార్టీ మంత్రిలేని కేబినెట్ ఆ ప్రభుత్వనీదే’ - Sakshi

‘మైనార్టీ మంత్రిలేని కేబినెట్ ఆ ప్రభుత్వనీదే’

దేశ చరిత్రలో మైనార్టీ మంత్రిలేని కేబినెట్ ఏపీ ప్రభుత్వానిదేనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు.

విజయవాడ: దేశ చరిత్రలో  మైనార్టీ మంత్రిలేని కేబినెట్ ఏపీ ప్రభుత్వానిదేనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. ఆంధ్రరత్న భవన్ లో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ విందుకు రఘువీరాతో పాటు పార్టీ నేతుల హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన జరుగుతుందని అన్నారు.

కేబినెట్లో మైనారిటీ మంత్రి లేకపోవడం చాలా దారుణమన్నారు. చంద్రబాబు మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో మైనార్టీలను రెండవ శ్రేణి వారిలా చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ముస్లింలకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement