కోళ్లను మింగిన కొండ చిలువ

Python Snake Swallow Hens In Guntur - Sakshi

గుంటూరు, తాడేపల్లిరూరల్‌ :వనాలు, కొండల్లో సంచరించే కొండ చిలువ ఒకటి ఉండవల్లి గ్రామంలోకి ఆదివారం తెల్లవారు జామున ప్రవేశించింది. ఓ ఇంటి వరండాలో ఉన్న నాలుగు కోళ్లనుమింగేసింది. ఆ తర్వాత అక్కడే ఉన్న మేకను మింగేందుకు ప్రయత్నించింది.

అలికిడికి నిద్ర లేచిన ఇంటిలోని సభ్యులు కొండ చిలువను ఒక్కసారిగా చూసి భయాందోళనకు గురయ్యారు. కొండ చిలువ మింగిన నాలుగు కోళ్లను వారి ఎదుట బయటకుఊసివేయడంతో భయంతో వణికిపోయారు. ధైర్యం చేసిన ఇంటి యజమానికొండ చిలువను మట్టుబెట్టాడు. అది సుమారు 10 అడుగుల పొడవు ఉండడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top