
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు.
సాక్షి, తిరుమల: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మంగళవారం జోగి నాయుడుతో కలిసి కాలి నడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకొని, స్వామివారికి తలనీలాలు కూడా చెల్లించుకుంటానని పృథ్వీరాజ్ తెలిపారు. ఇడుపులపాయలో వైఎస్సార్ స్మారక చిహ్నాన్ని సందర్శిస్తామని చెప్పారు.