breaking news
	
		
	
  jogi naidu
- 
      
                   
                               
                   
            ఝాన్సీతో విడాకులు.. 8 ఏళ్లు కోలుకోలేకపోయా.. : జోగి నాయుడు ఎమోషనల్
టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన జోగి నాయుడు తర్వాతి కాలంలో నటుడిగానూ మారారు. స్వామి రారా, దృశ్యం, కుమారి 21 ఎఫ్, నువ్వలా నేనిలా, గుంటూరు టాకీస్ వంటి పలు చిత్రాల్లో నటించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయన్ను ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా నియమించింది. జోగి నాయుడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. యాంకర్ ఝాన్సీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన కూతురు పుట్టాక ఆమెతో విడిపోయారు. తనతో ఉండటానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఝాన్సీ ఒప్పుకోకపోవడంతో విడాకులు ఇచ్చేశారు. తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. తాజాగా తన మొదటి పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు జోగి నాయుడు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు.. '1995లో ఝాన్సీ నాకు తొలిసారి పరిచయమైంది. అప్పుడామె ఇంటర్ చదువుతోంది. జీకే మోహన్ తీసిన ఓ సినిమాలో తను నటించింది. అప్పుడు నేను జీకే మోహన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నా. ఆ సమయంలోనే మా ప్రేమ చిగురించింది. మేము కలిసున్న జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుని సంతోషపడుతూ ఉంటాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, తను యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. చిన్న స్థాయి నుంచి పైకి ఎదుగుతూ వచ్చాం. దాదాపు తొమ్మిదేళ్లపాటు మేమిద్దరం కలిసే ఉన్నాం. కానీ ఇద్దరం మంచి స్టేజీకి వచ్చిన తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఏడాదిలోనే విడిపోవాల్సి వచ్చింది. అప్పటికి మాకు ధన్య అనే కూతురు ఉంది. బ్రహ్మానందం, చిరు మమ్మల్ని కలపాలనుకున్నారు కలిసుండాలని నేను ఎంతో ప్రయత్నించాను, కానీ అది జరగలేదు. మా బంధం ఇంతవరకే అని రాసిపెట్టుందేమో, దాన్నెవరు ఆపగలరు? కానీ నాకున్న ఎమోషన్స్ వల్ల ఏడెనిమిది సంవత్సరాలు ఆ బాధలో నుంచి బయటపడలేకపోయాను. బ్రహ్మానందం ఒక తండ్రి స్థానంలో నిలబడి మమ్మల్ని కలిపేందుకు చాలా ప్రయత్నించారు. చిరంజీవి కూడా మమ్మల్ని కూర్చోబెట్టి రెండు,మూడు గంటలపాటు మాట్లాడారు. కానీ వర్కవుట్ కాలేదు. తనతో నడిచిన ప్రయాణంలో జీవితకాలం సరిపడా జ్ఞాపకాలు పోగేసుకున్నాను. వారానికోసారి పాపను చూసేదాన్ని ఆ తర్వాత మేమిక కలవడం జరగని పని అని అర్థమయ్యాక అమ్మానాన్న చెప్పిన మాట విని రెండో పెళ్లి చేసుకున్నాను. కానీ నా కూతురు దూరమైపోయిందన్న బాధ మాత్రం అలాగే ఉంది. తను నాకు దూరంగా సంతోషంగా ఉంది. కానీ తనను చూడలేకపోతున్నాను నా తమ్ముడు చనిపోయాడు. వాడిని ఎప్పటికీ చూడలేను. వీళ్లిద్దరి విషయంలో ఒకలాగే ఫీలవుతాను. ఇద్దరూ ఎక్కడో ఉన్నారు. కానీ మాట్లాడలేకపోతున్నా. ఝాన్సీతో విడాకులు తీసుకున్న తర్వాత నా కూతురు చిన్నప్పుడు తల్లి దగ్గర పెద్దయ్యాక తండ్రి దగ్గర ఉండాలని కోర్టు చెప్పింది. అందుకే తల్లి దగ్గరే పెరిగింది. వారానికోసారి పంపించేది. పేగు బంధాన్ని చుట్టపుచూపుగా తీసుకువస్తే అన్యాయం అనిపించింది. గంట కోసం దెబ్బలాడేవాడిని మా మామయ్య తనను తీసుకువచ్చినప్పుడు టైం చూసుకుని గంట అయిపోయింది అనేవారు. అరగంట, గంట కోసం దెబ్బలాడేవాడిని. నా కూతురిని పంపించనని అనేవాడిని. అది చూసి నా చిట్టితల్లి కన్నీళ్లుపెట్టుకునేది. అలా ఎన్నోసార్లు ఏడుస్తూ వాళ్లతో వెళ్లిపోయింది. నా బిడ్డ నలిగిపోతుందని అర్థమై ఇక మీదట పంపించొద్దన్నాను. కానీ తను స్కూల్‌కు వెళ్లేటప్పుడు, ఆడుకునేటప్పుడు చూడాలని వాళ్లుండే కాలనీలోనే ఇల్లు తీసుకున్నాను. అందరూ డిస్టర్బ్ అవుతుండటంతో నేనే దూరంగా వచ్చేశా. నా కూతురు ఎప్పటికైనా నా దగ్గరకు వస్తుందిలే అనుకున్నాను. అది జరగలేదు. అందుకే దేవుడు కరుణించి నాకు కొత్త జీవితం ఇచ్చి ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చాడు. వాళ్లలోనే నా ధన్యను చూసుకుంటున్నాను' అని ఎమోషనల్ అయ్యారు జోగి నాయుడు. చదవండి: కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కేరళ స్టోరీ - 
  
    
                
      ఈ ఫైబర్ నెట్ వల్ల చిన్న సినిమా నిర్మాతలకు డబ్బులే డబ్బులు
 - 
      
                   
                               
                   
            సినిమా వాళ్లంటే సీఎం జగన్‌కు ఎంతో అభిమానం, అందుకే..: జోగి నాయుడు
ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం అందరికీ సాధ్యపడదు. అంతదాకా ఎందుకు థియేటర్లో సినిమా చూడటం కూడా చాలామందికి సాధ్యం కాని అంశమే! పల్లెటూర్లలో ఉన్నవాళ్లు, మారుమూల గ్రామాల్లో నివసించేవారికి థియేటర్ అందుబాటులో ఉండదు. దీంతో వారు సినిమాలు రిలీజైన వెంటనే చూడలేరు. ఓటీటీలకు వచ్చేదాకా ఆగాల్సిందే! అయితే వారికి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఏపీఎస్ఎఫెల్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురాగా ఇప్పుడేకంగా సినిమాలను డైరెక్ట్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్, నటుడు జోగి నాయుడు మాట్లాడుతూ.. 'సినిమా ఇండస్ట్రీకి సీఎం జగన్ ప్రభుత్వం ఎంతో గౌరవం ఇచ్చింది. సినిమా వాళ్లంటే ఆయనకు ఎంతో అభిమానం. అందుకే సినిమావాళ్లకు ఏడెనిమిది పోస్టులు ఇచ్చారు. ఫైబర్‌నెట్ ద్వారా సినిమా రిలీజ్ అనేది కూడా ఒక సంక్షేమమే! ఈ అవకాశం చిన్న నిర్మాతలకు గొప్ప వరం' అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'చిన్న నిర్మాతలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న గొప్ప అవకాశమిది. ఇప్పుడు ఓటీటీ కోసం సినిమాలు చేస్తున్నారు. రేపు ఫైబర్ నెట్ కోసం సినిమాలు తీస్తారు. ఏపీ ఫైబర్‌నెట్ పెద్ద రేంజ్‌కు వెళ్లడానికి మేము సహకరిస్తాం' అని తెలిపారు. - 
      
                   
                               
                   
            ఏపీ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా జోగి నాయుడు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా సినీనటుడు ఎల్.జోగి నాయుడుని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్లోని చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు చలనచిత్ర నటుడిగా 150కి పైగా చిత్రాలలో నటించారు. చిత్ర, టెలివిజన్ రంగాలలోని పలు విభాగాలలో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉంది. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. జోగి నాయుడు నియామకానికి సంబంధించి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు చేపట్టనున్నారు. - 
      
                   
                               
                   
            ‘జగన్ సీఎం కావడం ఖాయం’
సాక్షి, తిరుమల: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మంగళవారం జోగి నాయుడుతో కలిసి కాలి నడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకొని, స్వామివారికి తలనీలాలు కూడా చెల్లించుకుంటానని పృథ్వీరాజ్ తెలిపారు. ఇడుపులపాయలో వైఎస్సార్ స్మారక చిహ్నాన్ని సందర్శిస్తామని చెప్పారు. - 
  
    
                
      వైఎస్సార్సీపీలో చేరిన జోగినాయుడు
 - 
      
                   
                               
                   
            వైఎస్సార్సీపీలో చేరిన జోగినాయుడు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీలో చేరేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వస్తున్నారు. తాజాగా సినీ రంగానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీలో చేరారు. హాస్య నటుడు జోగినాయుడు సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం వైఎస్సార్సీపీలోకి వచ్చారు. లోటస్‌పాండ్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలతో వీరిని సాదరంగా ఆహ్వానించారు. నటులు పృథ్వి, కృష్ణుడు ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్సీపీలో చేరారు. జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి తేజస్విని తదిరులు వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు చివరికి దోచుకోవడానికి ఏమిలేక ఓట్లు కూడా దోచుకుంటున్నారని ఆరోపించారు. వీధి నాటకాల ద్వారా టీడీపీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. - 
      
                   
                               
                   
            యాంకర్ భర్తకు రెండో పెళ్లి..
విశాఖపట్నం ,నర్సీపట్నం: వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తెలుగు సినీరంగంలో నటుడిగా రాణిస్తున్నారు. తొలుత ఒక యాంకర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు విడిపోయారు. దీంతో తన స్వగ్రామం చెర్లోపాలేనికి చెందిన సౌజన్యను రెండవ వివాహం చేసుకున్నారు. - 
      
                   
                               
                   
            ఎవరి కోసం సాధికారమిత్రలు!
శృంగవరపుకోట: రాష్ట్రంలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, ప్రజల సొమ్ము ఖర్చు చేస్తూ పార్టీనీ బలోపేతం చేసుకునే కుట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని ఎస్.కోట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనర్ ఎ.కె.వి.జోగినాయుడు విమర్శించారు. బుధవారం ఎస్.కోటలో పలువురు వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధికారమిత్రల నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 219పూర్తిగా రాజ్యాంగ విరుద్దమన్నారు. బలమైన మహిళలను సాధికారమిత్రలుగా ఎంపిక చేస్తామనటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సాధికారమిత్రలు తప్ప మిగిలిన మహిళలు బలహీనులు అని ముఖ్యమంత్రి ఉద్దేశమా అంటూ ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ హామీతో అధికారంలో వచ్చిన బాబు తన హామీని మాఫీ చేసి మహిళలను మోసం చేశారన్నారు. సాధికారమిత్రలకు నెలకు రూ.18,000లు వేతనంగా ఉపా«ధి హామీ నిధులు వాడుకోటానికి తెగబడ్డారన్నారు. 4,60,000 మంది సాధికార మిత్రలతో ప్రతినెలా 21న ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారని, సంక్షేమ పథకాల అమలు, శాఖల పనితీరును పర్యవేక్షించి, జవాబుదారీతనాన్ని సాధికారమిత్రలు పెంచుతారని చెప్పటం సిగ్గుచేటన్నారు. ఆయనతో పాటు సర్పంచ్‌లు టి.గంగాభవాని, ఎం.కాశీవిశ్వనాధం. ఎమ్పీటీసీ మోపాడ కుమార్, మండల కన్వీనర్లు ఎం.సత్యన్నారాయణ, కె.కన్నంనాయుడు, నేతలు వాకాడ రాంబాబు, పి.వెంకటరమణ, కె.పాల్‌కుమార్, చింతల సత్యన్నారాయణమూర్తి, మోపాడ నాయుడు, మోపాడ గౌరినాయుడు, జి.పైడితల్లి, ఎన్.శ్రీనివాసరావు, రంధి అనంత్, ఎం.సోమునాయుడు తదితరులు ఉన్నారు. - 
      
                   
                               
                   
            అప్పుడూ ఇప్పుడూ వాళ్లే నాకు అండ!

 ‘‘కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు జనాల్లో గుర్తింపు, క్రేజ్ ఉంటాయి. ఈ మూడు రంగాల్లో ఒకటైన సినీ ప్రపంచంలో ఉండటం నా అదృష్టం’’ అని జోగి నాయుడు పేర్కొన్నారు. దర్శకుడు కావాలనుకుని వచ్చినా నటునిగా పేరు తెచ్చుకుని, త్వరలో నిర్మాతగా కూడా మారనున్నారు జోగినాయుడు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన 20ఏళ్ల సినీ ప్రస్థానంలోని మలుపుల్ని గుర్తు చేసుకున్నారాయన. ‘‘2001లో ‘మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది’తో ఈవీవీగారు నన్ను నటునిగా పరిచయం చేశారు. ఇప్పటికి వందకు పైగా సినిమాలు చేశాను. ‘స్వామి రారా’తో నా కెరీర్ ఊపందుకుంది.
 
 ఆ ఒక్క సినిమా వల్ల నాకు 20 సినిమాల్లో అవకాశాలొచ్చాయి’’ అని జోగి నాయుడు సంతోషం వెలిబుచ్చారు. ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటని అడిగితే - ‘‘ఇప్పుడు నేను బ్యాచ్‌లర్‌ని. అదే ఈ పుట్టినరోజు ప్రత్యేకత’’ అన్నారు నిర్వేదంగా. ఝాన్సీ నుంచి విడిపోయారు కాబట్టి, మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అనడిగితే -‘‘మళ్లీ పెళ్లి గురించి ఆలోచించడంలేదు. ప్రస్తుతం నా దృష్టంతా చేస్తున్న సినిమాలపైనా, టీవీ షోస్ పైనే. ఈ ఏడాది చివర్లో ఓ నిర్మాణ సంస్థ ఆరంభించాలనుకుంటున్నా. కథలు సిద్ధంగా ఉన్నాయి. చిన్న బడ్జెట్ చిత్రాలు నిర్మించాలనుకుంటున్నా’’ అన్నారు.
 
 మీ పాప ధన్య ఎవరి దగ్గర ఉంటోంది? అనే ప్రశ్నకు -‘‘ఇటీవలే మాకు విడాకులు వచ్చాయి. ప్రస్తుతం పాప ఝాన్సీ దగ్గరే ఉంటోంది. పాప నన్ను కలవొచ్చనే విషయమై కోర్టులో కేసు సాగుతోంది. నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నా’’ అని తెలిపారు. అసలు ఝాన్సీ నుంచి ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు? అంటే.. ‘‘మా మధ్య ఏవో మనస్పర్థలొచ్చాయి. పరిష్కరించుకుని, కలిసి ఉండాలనుకున్నా. కానీ, తనకిష్టం లేదు. దాంతో, విడాకులు ఇవ్వక తప్పలేదు’’ అని చెప్పారు. మీ జీవితంలో పశ్చాత్తాపపడే సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అనడిగితే -‘‘ఏమీ లేవు.
 
 అసిస్టెంట్ డెరైక్టర్‌గా వచ్చినప్పుడు పూరి జగన్నాథ్ దగ్గర చేశాను. కృష్ణవంశీ దగ్గర కూడా పని చేయాలనుకున్నా. ‘జోగి బ్రదర్స్’ షో చూసి, ఆయనే పిలిపించి సహాయ దర్శకునిగా చేర్చుకున్నారు. అదే షో చూసి, ఓరోజు చిరంజీవిగారు నన్నూ, జోగి కృష్ణంరాజుని పిలిపించి ‘అసలు ఎలా చేస్తారయ్యా.. చాలా బాగుంటుంది’ అంటూ ఇద్దర్నీ అమాంతంగా హత్తుకున్నారు. నా పెళ్లి, మా పాప పుట్టినప్పుడు.. ఇలా నా జీవితంలో ఆనందపడే సంఘటనలు చాలా ఉన్నాయి.
 
 నేనెప్పుడూ మంచి విషయాలను మనసులో ఉంచుకుని, చెడు సంఘటనలను మర్చిపోతాను. నేను పశ్చాత్తాపపడాల్సిన సంఘటనలేవీ నా జీవితంలో జరగలేదు. అలాంటి పనులు కూడా చేయలేదు. ఎవరి కోసమూ సినిమా పరిశ్రమకు రాలేదు. నాకోసం వచ్చాను. చిన్న పల్లెటూరి నుంచి ఇక్కడికొచ్చినప్పుడు మా అమ్మా, నాన్న నాకు అండగా నిలిచారు. ఇప్పుడూ వాళ్లే నా అండ’’ అన్నారు. భవిష్యత్తులో సినిమాలకు దర్శకత్వం వహించే ఆలోచన ఉందని జోగినాయుడు వెల్లడించారు. - 
      
                    
యంగ్ ఇండియా పత్రికను ఎవరు ప్రారంభించారు?

 1. కుతుబ్‌షాహీలు పరిపాలించిన దక్కను ప్రాంతం?
 గోల్కొండ
 
 2. మద్రాస్‌లో రైత్వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
 సర్ థామస్ మన్రో
 
 3. యానాంలో వర్తక స్థావరాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
 ఫ్రెంచి వారు
 
 4. ఏ గవర్నర్ కాలంలో సతీసహగమనం, స్త్రీ, శిశు హత్యలను నిషేధించారు?
 విలియం బెంటింక్ (1829లో)
 
 5. ఆంధ్రాలో ‘బొబ్బిలియుద్ధం’ ఎప్పుడు జరిగింది?
 క్రీ.శ. 1757లో
 
 6. భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని సుస్థిరం చేయడానికి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
 లార్డ డల్హౌసీ
 
 7. భారతదేశంలో రైల్వేబోర్డను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
 1936లో
 
 8. గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను ఏ సంవత్సరంలో నిర్మించారు?
 1853లో
 
 9. ఆంధ్రదేశంలో గ్రామాల చరిత్రను కైఫీయతులు పేరుతో రూపొందించిన ఆంగ్లేయుడు?
 కల్నల్ మెకంజీ
 
 10. తెలుగు భాషకు విశేష కృషి చేసిన ఆంగ్లేయుడు?
 సి.పి. బ్రౌన్
 
 11. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
 దాదాబాయ్ నౌరోజీ
 
 12. ముస్లింలకు ఆధునిక విద్యను అందించడానికి విశేష కృషి చేసిన వారు?
 సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్
 
 13. యువ బెంగాల్ ఉద్యమ నాయకుడు?
 ఎమ్.వి. డెరోజీయో
 
 14. రాధాస్వామి సత్సంగ్ స్థాపకుడు?
 తులసీరామ్
 
 15. తెలుగులో మొదటి సాంఘిక నవల?
 రాజశేఖర చరిత్ర
 
 16. రామకృష్ణ మిషన్ ముఖ్య కేంద్రం ఎక్కడ ఉంది?
 బేలూరులో
 
 17. పాశ్చాత్య దేశాల్లో హిందూమత ఉన్నతి కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త?
 స్వామి వివేకానంద
 
 18. భారత బ్రహ్మసమాజాన్ని 1866లో ఏర్పాటు చేసిన సంఘ సంస్కర్త ఎవరు?
 కేశవ చంద్రసేన్
 
 19. 1906లో ఆంధ్రాలో కొమర్రాజు లక్ష్మణ రావు ప్రారంభించిన ముద్రణాలయం పేరు?
 విజ్ఞాన చంద్రికామండలి
 
 20. సారే జహాసే అచ్ఛా - హిందుస్థాన్ హమారా గేయ రచయిత?
 మహ్మద్ ఇక్బాల్
 
 21. ఆర్య సమాజాన్ని ఏ సంవత్సరంలో ఎవరు స్థాపించారు?
 దయానంద సరస్వతి, క్రీ.శ. 1875లో
 
 22. పార్శీల పవిత్ర గ్రంథం పేరు?
 అవెస్టా
 
 23. జొరాష్ట్రియన్ మత స్థాపకుడు?
 జొరాష్టర్
 
 24. వివేకవర్దిని మాస పత్రిక, హితకారిణి సమాజం ద్వారా సంఘ సంస్కరణలు చేపట్టినవారు?
 కందుకూరి వీరేశలింగం
 
 25. కందుకూరి వీరేశలింగం స్మారక మ్యూజియం ఆంధ్రాలో ఎక్కడ ఉంది?
 రాజమండ్రిలో
 
 26. బాలురకు 18 ఏళ్లు, బాలికలకు 14 ఏళ్లు వివాహ వయసుగా నిర్దేశిస్తూ 1930లో ఏ చట్టాన్ని ప్రవేశపెట్టారు?
 శారదాచట్టం
 
 27. బంకించంద్ర రచించిన ఆనందమఠ్ నవల దేన్ని గురించి వివరిస్తుంది?
 ఒక సన్యాసి తిరుగుబాటు
 
 28. ఆంధ్ర దేశంలో బ్రహ్మసమాజ మందిరాలు ఎక్కడ ఉన్నాయి?
 కాకినాడ బ్రహ్మసమాజం,
 దక్కను బ్రహ్మసమాజం (హైదరాబాద్)
 
 29. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఢిల్లీలో మొగలు చక్రవర్తి ఎవరు?
 రెండో బహదూర్ షా
 
 30. గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడెవరు?
 దర్శిచెంచయ్య
 
 31. జలియన్ వాలాబాగ్ హత్యాకాండ ఎప్పుడు, ఎక్కడ జరిగింది?
 1919 ఏప్రిల్ 13న, అమృత్సర్(పంజాబ్)
 
 32. ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమం ఎక్కడ ప్రారంభమైంది?
 చీరాల, పేరాల, పెదనందిపాడు, పల్నాడు
 
 33. {బిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికైన ప్రథమ భారతీయుడు?
 దాదాబాయి నౌరోజీ
 
 34. వందేమాతరం గేయ రచయిత?
 బంకించంద్ర చటర్జీ
 
 35. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ స్వీయ రచన ఎవరికి సంబంధించింది?
 మహాత్మాగాంధీ
 
 36. భారతదేశానికి పూర్ణ స్వాతంత్య్రం సిద్ధించాలని భారత జాతీయ కాంగ్రెస్ ఏ సదస్సులో తీర్మానించింది? దాని అధ్యక్షుడెవరు?
 1929 లాహోర్ సదస్సులో,
 పండిత్ నెహ్రూ అధ్యక్షుడు
 
 37. భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదట అధ్యక్షత వహించిన మహిళ?
 అనిబీసెంట్
 
 38. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని విడిచి వెళ్లే సమయంలో బ్రిటన్ ప్రధాని?
 అట్లీ
 
 39. సరిహద్దు గాంధీ అని ఎవరిని పేర్కొంటారు? ఆయన ఏర్పాటు చేసిన సేవాదళం పేరు?
 ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్.
 కుదైకిద్మత్గార్ (దేవుడి సేవకులు)
 
 40. తెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్రాలో విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్‌గా ఎప్పుడు ఏర్పాటు చేశారు?
 1956 నవంబరు 1
 
 41. పోర్చుగీసు స్వాధీనంలోని గోవా భారతదేశంలో ఎప్పుడు విలీనం అయింది?
 1961 డిసెంబరు 20న
 
 42. యంగ్ ఇండియా పత్రికను ఎవరు ప్రారంభించారు?
 మహాత్మాగాంధీ
 
 43. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం భక్తి పాటను ఎవరు రచించారు?
 విష్ణు దిగంబర పులూస్కర్
 
 44. మద్రాసులో హిందూ సాంఘిక సంస్కరణ సంఘాన్ని ఎవరు స్థాపించారు?
 కందుకూరి వీరేశలింగం
 
 45. సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించినవారు?
 గోపాలకృష్ణ గోఖలే
 
 46. 1857 నాటి సిపాయిల తిరుగుబాటును ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ యుద్ధంగా ఎవరు అభివర్ణించారు?
 వి.డి. సావార్కర్
 
 47. గులాంగిరి గ్రంథ రచయిత?
 జ్యోతిబాపూలే
 
 48. ద్వైతాద్వైత సిద్ధాంతకర్త?
 నింభార్కుడు
 
 49. కాశీయాత్ర గ్రంథాన్ని ఎవరు రచించారు?
 ఏనుగుల వీరాస్వామి
 
 50. ఆంధ్రాలో దత్త మండలాలకు రాయలసీమ అని ఎవరు పేరు పెట్టారు?
 గాడిచర్ల హరిసర్వోత్తమరావు
 
 51. మాలపల్లి తెలుగు నవలా రచయిత?
 ఉన్నవ లక్ష్మీ నారాయణ
 
 52. ఆంధ్ర- మద్రాసు రాష్ట్రాల విభజన సంఘానికి అధ్యక్షుడు?
 కుమారస్వామిరాజు
 
 53. కర్నూలు రహాస్య సర్క్యూలర్ రూపొందించిన నేత?
 కళా వెంకట్రావు, 1942లో
 
 54. 1930 నాటి తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది?
 లండన్‌లో
 
 55. 1930 నాటి దండి ఉప్పు సత్యాగ్రహం(శాసనోల్లంఘన ఉద్యమం)లో పాల్గొన్న ఆంధ్రుడు?
 ఎర్నేని సుబ్రమణ్యం - 
      
                   
                               
                   
            మక్కామసీదును నిర్మించినవారు ఎవరు?

 ఏపీ హిస్టరీ 
 డా॥పి. జోగినాయుడు
 డిప్యూటీ డెరైక్టర్ (రిటైర్డ్)
 ఆర్కియాలజీ - మ్యూజియమ్స్
 
 కుతుబ్‌షాహీల కాలంనాటి సాంఘిక పరిస్థితులు: యూరోపియన్ యాత్రికులు, వర్తకులు, రాయబారులు రాసిన గ్రంథాల ద్వారా కుతుబ్‌షాహీల కాలంనాటి మత-సాంఘిక పరిస్థితులు తెలుస్తున్నాయి. గోల్కొండ నవాబుల రాజభాష పారశీకం అయినా, తెలుగు భాష కూడా వారి పాలనలో మంచి అభివృద్ధినే సాధించింది. తెలుగు, దక్కనీ ఉర్దూ, పారశీక భాషలు ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. ఈ యుగంలో మతమౌఢ్యాలు, మూఢాచారాలు ప్రజల్లో వ్యాప్తి చెందాయి. జ్యోతిషం, ముహూర్త బలాలు, దుష్టఘడియల ప్రమాదాలు, సూర్య చంద్రులను, నక్షత్రాల్ని దేవతలుగా నమ్మడం లాంటివి ఉన్నట్లు బెర్నియర్ రాశాడు. బ్రాహ్మణులకు గణితం, జ్యోతిషం, ఖగోళ శాస్త్రాల్లో మంచి పరిజ్ఞానం ఉందని మూర్‌ల్యాండ్ పేర్కొన్నాడు. వైశ్యులు వర్తకం చేసేవారని, గణితంలో వీరికి మంచి పట్టు ఉండేదని బౌరే రాశాడు. శూద్రులు ప్రభువుల వద్ద సేవకులుగా, సైనికులుగా పనిచేసేవారని మెత్‌హాల్డ్ పేర్కొన్నాడు.
 
 సంఘంలో వితంతువులది బాధాకరమైన స్థితి. నగలు పెట్టుకోకూడదు, శుభ్రమైన దుస్తు లు ధరించకూడదు. బంధువులకు దూరంగా ఉండేవారు. సమాజంలో వేశ్యలకు గౌరవం ఉండేది. వారికి అండగా పాలకవర్గం ఉండేది. గోల్కొండలో 20 వేల మంది వేశ్యలు ఉండే వారని టావెర్నియర్ రాశాడు. వారికి ప్రభుత్వం లెసైన్సులు ఇచ్చేది. వారి నుంచి పన్నులు వసూలు చేసేవారు కాదు. దేవదాసీలకు సంఘంలో మంచి గౌరవం ఉంది. హైదరాబాద్ నగర నిర్మాత మహ్మద్ కులీకుతుబ్‌షా ‘కుల్లియత్’ అనే గ్రంథాన్ని ఉర్దూ భాషలో రచించాడు. ఇందులో హిందువుల, ముస్లింల పండగల గురించి వివరించాడు. మొహర్రం, రంజాన్, దీపావళి, హోళీ, వసంతోత్సవం లాంటి పండగలను వర్ణించాడు. మహమ్మదీయుల వాస్తు కట్టడాల్లో పూర్ణ కుంభం, లతాపద్మాలు, హంసలు, ఏనుగులు లాంటి హిందూ వాస్తు సంప్రదాయాలు ప్రవేశించాయి. కుతుబ్‌షాహీలు పారశీక దేశం నుంచి వచ్చిన షియా మతస్థులు. షియా సంప్రదాయానికి సహజమైన సహనాన్ని పరిపాలనలో ప్రదర్శించారు. జాతి, మత విభేదాలు పాటించకుండా, అర్హత ఉన్నవాళ్లకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి, తెలుగువారి సహాయంతో ఆంధ్రదేశాన్ని సమైక్యం చేశారు.
 
 వాస్తు - స్మారక నిర్మాణాలు
 గోల్కొండ కుతుబ్‌షాహీల కట్టడాలు, షియామత సూత్రాలకు అనుగుణంగా పారశీక, బహమనీ హిందూ సంప్రదాయాల సమ్మేళనంగా ఉంటాయి. ఈ శైలిలో గుమ్మటాలు, కమాన్లు, మీనార్లు ఉంటాయి. పుష్పాలు, లతలు, పక్షులు ఈ నిర్మాణాల్లో కన్పిస్తాయి. వాస్తుపరంగా విశిష్టమైన కుతుబ్‌షాహీ శైలి వెలుగులోకి వచ్చింది. వీరు ప్రధానంగా పారశీక వాస్తుతో పాటు బహమనీ సుల్తానుల వాస్తునే అనుసరించారు. పెద్ద గుమ్మటాలు, విశాలమైన ప్రవేశ ద్వారాలు, ఎత్తయిన మీనార్లు అష్ట కోణాకృతి నిర్మాణాలు ఈ శైలికి ముఖ్య లక్షణాలు. హైదరాబాద్‌లోని చార్మినార్, చార్‌కమాన్, మక్కామసీదు, టోలీ మసీదు, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీల సమాధులు, బాదుషాహీ అసూర్‌ఖానా లాంటి నిర్మాణాలు, కుతుబ్‌షాహీ వాస్తుకు అద్దం పడతాయి.
 
 కుతుబ్‌షాహీ మూడో సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో మూసీనదిపై క్రీ.శ. 1578 పురానాఫూల్ (పాతవంతెన)ను నిర్మించారు. ఇతడి కాలంలోనే హుస్సేన్ సాగర్, బద్వేల్, ఇబ్రహీంపట్నం, గోల్కొండ కోటలోని ఇబ్రహీం మసీదులను నిర్మించారు. మహ్మద్ కులీకుతుబ్ తన ప్రేయసి భాగమతి పేరుపై మూసీ నది దక్షిణ ప్రాంతంలో క్రీ.శ. 1591లో చిచిలం గ్రామం (ప్రస్తుత షా-ఆలి-బండ ప్రాంతం)లో ప్లేగు వ్యాధి నివారణకు జ్ఞాపకంగా నాలుగురోడ్ల కూడలి మధ్య చార్మినార్‌ను నిర్మించాడు. చార్మినార్ పక్కనే ఉన్న జమామసీదును 1594లో కులీ నిర్మించాడు. దీంతోపాటు మహ్మద్ కులీ పత్తర్‌గట్టి ప్రాంతం (హైదరాబాద్)లో బాదుషాహీ అసూర్‌ఖానా, దారుల్షిఫా(ఆసుపత్రి), చార్ కమాన్ లాంటి నిర్మాణాలు చేశాడు. వీటిని రాయి, సున్నంతో నిర్మించారు. కులీ కుతుబ్‌షా అల్లుడైన మహ్మద్ కుతుబ్‌షా (క్రీ.శ. 1612- 1626) దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన మక్కా మసీదును క్రీ.శ. 1617లో నిర్మించాడు.
 
 కుతుబ్‌షాహీల ఇతర స్మారక నిర్మాణాలు, గోల్కొండ కోట అంతర్భాగంలో భక్తరామదాసు బందిఖానా, రాణీమహల్‌లు, సుల్తాన్ల మరణాంతరం ఖననానికి ముందు స్నానం చేయించే గదులు నేటికీ ఉన్నాయి. సుమారు వంద ఎకరాల స్థలంలో నిర్మించిన కుతుబ్‌షాహీల సమాధులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాస్తు నిర్మాణాలు. ఒకే రాజవంశానికి చెందిన సుల్తానుల సమాధులన్నీ (అబుల్ హసన్ తానీషా తప్ప) ఒకే ప్రాంగణంలో నిర్మించడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కన్పించదు. సమాధుల డోమ్ అంతర్భాగాన్ని అష్టకోణాకృతిలో ప్రత్యేక పరిజ్ఞానంతో నిర్మించారు. కుతుబ్‌షాహీల కాలంనాటి చిత్రకళ, మొగలులు, హిందూ- పారశీక సంప్రదాయం లో దక్కనీ చిత్రకళ చరిత్రలో పేరుగాంచింది. తారీక్ హుస్సేన్ ‘షాహిద్ -షాహీ దక్కన్’ గ్రంథంలో 14 సూక్ష్మ చిత్రాలు ఉన్నాయి. మహమ్మద్ కులీకుతుబ్‌షా రచించిన ‘కుల్లియత్’ గ్రంథంలో 14 సూక్ష్మచిత్రాలు (మీనియేచర్ చిత్రాలు) ఉన్నాయి. దక్కను ఉర్దూలో రాసిన మొదటి గ్రంథంగా ‘కుల్లియత్’ను పేర్కొంటారు. 


