గుంటూరు జిల్లాలో శ్రీకృష్ణుడి ఫ్లెక్సీ తొలగింపుపై వివాదం చెలరేగింది. దుగ్గిరాల పట్టణంలోని శివాలయం సమీపంలో ఏర్పాటుచేసిన శ్రీకృష్ణుడి ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు తొలగించడంతో యాదవ కులస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు.
దుగ్గిరాల: గుంటూరు జిల్లాలో శ్రీకృష్ణుడి ఫ్లెక్సీ తొలగింపుపై వివాదం చెలరేగింది. దుగ్గిరాల పట్టణంలోని శివాలయం సమీపంలో ఏర్పాటుచేసిన శ్రీకృష్ణుడి ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు తొలగించడంతో యాదవ కులస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు.
తెనాలి-విజయవాడ మార్గంలో రాస్తారోకో చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. శ్రీకృష్ణుని ఫ్లెక్సీని తొలగించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పాడడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చిస్తున్నారు.