
సాక్షి, విజయవాడ: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నిరసన చేపట్టిన ఆందోళనకారుల పాస్‌పోర్టులు రద్దు చేస్తున్నారని కొన్ని మీడియా సంస్థల దుష్ప్రచారంపై విజయవాడ పాస్‌పోర్ట్ కార్యాలయం స్పందించింది. నిరసనల్లో పాల్గొన్నవారి పాస్‌పోర్టులు రద్దు చేయాలనే ప్రతిపాదన లేదని విజయవాడ పాస్‌పోర్ట్ అధికారి డీఎస్‌ఎస్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అటువంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. పాస్‌పోర్ట్ చట్టం, నియమ నిబంధనలను అనుసరించి మాత్రమే పాస్‌పోర్టులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పత్రికాప్రకటన విడుదల చేశారు.