ప్రమాదవశాత్తూ మంటలు చలరేగడంతో రెండు ఇళ్లు పూర్తిగా దహనం అయ్యాయి.
ప్రమాదవశాత్తూ మంటలు చలరేగడంతో రెండు ఇళ్లు పూర్తిగా దహనం అయ్యాయి. ఈ ఘటనలో రూ. 3 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన నర్సింహరావు ఇంట్లో లేని సమయంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా కాలిపోయింది. ఇది గుర్తించిన స్థానికులు మంటలు వ్యాపించకుండా ఆర్పేశారు.