భూసేకరణలో సమస్యలతోనే ప్రభుత్వ పథకాల అవులులో జాప్యం జరుగుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి దీపాదాస్‌మున్షీ అన్నారు.
సాక్షి, హైదరాబాద్: భూసేకరణలో సమస్యలతోనే ప్రభుత్వ పథకాల అవులులో జాప్యం జరుగుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి దీపాదాస్‌మున్షీ అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆరవ యూరో ఇండియా సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా వూట్లాడుతూ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి సాధ్యవుని చెప్పారు. గ్రావూలను వదలి, నగర బాట పడుతున్న యువతకు ఉపాధి కల్పన సవాల్‌గా మారిందన్నారు. పట్టణాలకు వలసలు పెరిగాయని, 2031నాటికి రెట్టింపయ్యే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు రూపొందిస్తున్నా, భూసేకరణలో అడ్డంకులు ఎదురవుతున్నందునే చట్టానికి మార్పులు చేశామన్నారు. హైదరాబాద్ కన్నా ఇతర నగరాల్లో మెరుగైన పరిస్థితులున్నాయని, దీనిపై అధ్యయనం చేయాలని ఆమె నిపుణులకు సూచించారు.
జనాభాకు తగినట్టు వలిక సదుపాయూలు...వుహీధర్
పట్టణీకరణ పెరిగి, పలు సమస్యలు ఎదురవుతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పట్టణాలకు వలసలు, 2011 నాటికి 33.49 శాతానికి పెరిగాయని, నగరాలు, పట్టణాల్లో మురికివాడల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నావుని తెలిపారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టావుని, నీరు, విద్యుత్, పర్యావరణ రక్షణను పరిగణనలోనికి తీసుకుని భవన నిర్మాణాలు చేపట్టాలని కచ్చితమైన ఆదేశాలు ఇచ్చావుని అన్నారు.