పండగ దగా

Private Travel Bus Services Prices Hikes Sankranthi Festival - Sakshi

పండుగ వేళ ప్రయాణికుల జేబులకు చిల్లు

టికెట్‌ ధరలు అమాంతం పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్‌

ప్రత్యేక సర్వీసుల పేరిట ఆర్టీసీ 50 శాతం అదనపు దోపిడీ

ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

సాక్షి, గుంటూరు: సంక్రాంతి పండుగ వారం రోజులుండగానే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దోపిడీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆపరేటర్లు ఆన్‌లై¯న్‌Œ ద్వారా టికెట్‌ రేట్లను విక్రయిస్తుండేవారు. పండగ నేపథ్యంలో తత్కాల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన చాలా మం ది చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. దీంతో పం డుగ పూట సొంతూరుకి రావాలన్నా, పండగ అ నంత రం ఆయా నగరాలకు తిరిగి వెళ్లాలన్నా జేబు లకు చిల్లు పడుతోంది. స్పెషల్‌ సర్వీసుల పే రుతో ఆర్టీ సీ టికెట్‌పై అదనంగా 50 శాతం రేట్లు వసూలు చేస్తుండగా, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆపరేటర్లు రెండడుగులు ముందుకేసి టికెట్‌ రేటును మూడు నుంచి నాలుగు రెట్లు అదనంగా వసూలుకు చేస్తున్నా రు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం కళ్లప్పగించి చూస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా టికె ట్‌ ధరలను పెంచుతున్న ట్రావెల్స్‌పై చర్యలు తీ సుకోవాల్సిన రవాణా శాఖ సైతం దోపిడీకి రైట్‌ రై ట్‌ చెబుతోంది. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు పరోక్షంగా సహకరిస్తోం ది.

ఆర్టీసీ స్పెషల్‌ సర్వీసులు..
సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యా సంస్థలకు ఈ నెల 12 నుంచి 20 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. పండుగ ముందు రెండో శనివారం, ఆదివారం కూడా కలిసి రవాడంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్న వారు నాలుగు రోజుల ముందే సొంతూళ్లకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో గుంటూరు రీజియన్, జిల్లాలోని వివిధ డిపోలలో ఆర్టీసీ నేటి నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి జిల్లాకు 100కుపైగా స్పెషల్‌ బస్సులు నడుపుతోంది. పండుగ అనంతరం ఆయా నగరాలకు తిరిగి వెళ్లే ప్రయాణికులు అధికంగా ఉంటారనే ఉద్దేశంతో 15, 16 తేదీల్లో సైతం ఆర్టీసీ అదనపు సర్వీసులు కేటాయిస్తోంది.

ఏటా ఇదే దోపిడీ...
మూడు రోజులపాటు సాగే సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చి, వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖపట్టణం వంటి నగరాలకు సాధారణంగా వీకెండ్‌ సమయాల్లో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తుంటాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులు రద్దీ అధికంగా ఉంటుందని భావించిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను సైతం తీసుకువచ్చి తిప్పుకుంటున్న తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఈ డిమాండ్‌కు అనుగుణంగా బస్సులను నడపాల్సి ఉన్నా మొక్కుబడిగా స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఇదే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆపరేటర్లకు వరంగా మారింది. ప్రతి ఏటా సంక్రాంతి సీజన్‌ కాసులు కురిపిస్తోంది. అడ్డగోలుగా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేసేందుకు పక్కా ప్రణాళికలను అమలు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top