జనరేటర్ల వెలుగులోనే అప్పన్నస్వామి | Power supply stalled in Simhachalam temple | Sakshi
Sakshi News home page

జనరేటర్ల వెలుగులోనే అప్పన్నస్వామి

Oct 27 2014 6:54 PM | Updated on Sep 18 2018 8:38 PM

విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి కాకపోవడంతో జనరేటర్ల వెలుగులోనే సింహాద్రి అప్పన్నస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు

విశాఖపట్నం: విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి కాకపోవడంతో జనరేటర్ల వెలుగులోనే సింహాద్రి అప్పన్నస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. రెండు వారాల క్రితం సింహాచలం అప్పన్నస్వామి దేవాలయంలో విద్యుత్ పనులను చేపట్టారు. అయితే రెండు వారాలు పూర్తి కావోస్తున్న విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి కాకపోవడంతో భక్తులకు ఇబ్బందిగా మారాయి. 
 
అధికారుల నిర్లక్ష్యమే విద్యుత్ పనులు పూర్తికాకపోవడానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. అప్పన్న స్వామి దేవాలయంలో విద్యుత్ పనులు ఎప్పుడూ పూర్తవుతాయనే విషయంపై అధికారులు నోరు విప్పక పోవడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement