ఎర్రచందనం దుంగలు స్వాధీనం | Possession of redwood logs | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Oct 14 2015 5:59 PM | Updated on Sep 3 2017 10:57 AM

తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.6 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.

తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.6 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

పక్కా సమాచారంతో మర్రిపాడు ఎస్సై సోమయ్య ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని కుంటనెల్లపాడు సమీపంలో రోడ్డు పక్కన తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 30 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వాటికి సంబంధించి అక్కడే మాటువేసి ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని, రెండు పల్సర్ బైక్‌లను సీజ్ చేశారు. నిందితులను రిమాండ్‌కు పంపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement