బెదిరింపులు.. చిత్రహింసలు

Police Threats To Tribes Family - Sakshi

గిరిజనులకు నరకం చూపిస్తున్న పోలీసులు

రేషన్, ఆధార్‌ కార్డులు లాక్కుని వేధింపులు

బలవంతపు లొంగుబాట్లతో పరువు నిలుపుకునే యత్నం

బుధవారం విడుదల చేసిన ప్రకటనలో

గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపి  

విశాఖ సిటీ: పోలీసులు మారుమూల గిరిజనులు రేషన్, ఆధార్‌ కార్డులు తీసుకుని స్టేషన్లకు రావా లని వేధిస్తున్నారనీ, స్టేషన్లకు వచ్చిన వారిని ఇన్‌ఫార్మర్లగా పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నారని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపి ఆరోపించారు. ఈమేరకు బుధవారం ఐదు పేజీల సుదీర్ఘ లేఖను గాలికొండ ఏరియా కమిటీ ఈస్ట్‌ డివిజన్‌ పేరుతో విడుదల చేశారు. దేశంలో ఆపరేషన్‌ హంట్‌ మూడో దశలో భాగంగా 2017 నుంచి సమాధాన్‌ అనే దానిని రూపొందించి మన్యంలో పోలీసులు గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని లేఖలో విమర్శించారు.

 దీనికి అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.గతంలో పట్టుకుని అరెస్టు చేసిన వారిని, లొంగిపోయిన వారిని కూడా తిరిగి తీసుకెళ్తున్నారన్నారనీ.. సీలేరు ఎస్‌ఐ విభూషణరావు, కొయ్యూ రు, మంప, గూడెం ఎస్‌ఐలు, సీఐలు ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారన్నారని వ్యాఖ్యానిం చారు. దేవరాపల్లి పంచాయతీ నక్కబందకు చెందిన పాంగి లక్ష్మణరావును íఫిబ్రవరిలో పట్టుకుని 30 రోజులు నిర్బంధించి తరువాత లొంగుబాటు చూపించారన్నారు. గాలికొండ పంచాయతీ పప్పుకూడకు చెందిన పాంగి కామేశ్‌ను వారం రోజులపాటు నిర్బంధించి ఆ తరువాత లొంగుబాటు చూపించారన్నారు.

 ఎం.భీమవరం పంచా యతీ పుట్టకోటకు చెందిన జర్త భానుప్రసాద్‌ (నవీర్‌)ను 2017లో పట్టుకుని నెల తరువాత లొంగుబాటు చూపించారన్నారని లేఖలో పేర్కొన్నారు. పదే పదే స్టేషన్లకు రావాలని సీలేరు, మంప, గూడెం, కొయ్యూరు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని గోపీ వ్యాఖ్యానించారు. కిందటి నెలలో నక్కబంద గ్రామంపై దాడి చేసి లక్ష్మణ రావును, సెప్టెంబర్‌ 26న పుట్టకోటకు చెందిన భానుప్రసాద్‌ను, పాంగి కామేశ్‌ను మరోసారి అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చెయ్య డం అమానుషమన్నారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు కొత్త ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టినా ఇంటర్నేషనల్‌ మోనిటరీ ఫండ్‌(ఐఎంఎఫ్‌)లో రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని రూపాయి మారకపు విలువను తగ్గించడంతో పతనం ప్రారంభమైందన్నారు. 

గిరిజన ఓట్లతో గెలిచి వారికే వెన్నుపోటు పొడుస్తున్న పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరితోపాటు మణికుమారి, బొర్రా నాగరాజు, ఎం.వి.వి.ఎస్‌ ప్రసాద్, ముక్కల మహేశ్, వెంగలయ్య, బేతా ళుడు, నాజర్‌వల్లి, కొర్రా బలరాం, లోకులగాంధీ లాంటి వారు పదవులు కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. వారెవరూ ఆదివాసీలపై పోలీసులు చేస్తున్న దాడులపై మాట్లాడడం లేదన్నారు. పోలీసు దాడులను ఆపకుంటే ప్రజల చేతిలో టీడీపీ, బీజేపీ నేతలు ఆగ్రహానికి గురికాక తప్పదని గోపి హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top