రాష్ట్రంలో 3,137 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Police recruitment timetable out - Sakshi

5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 3,137 పోలీసు పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు ఏపీ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ కుమార్‌విశ్వజిత్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్‌ఎల్‌పిఆర్‌బి.ఎపి.జిఓవి.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఈ నెల 5 వ తేదీ నుంచి 24వ తేదీ లోగా, కానిస్టేబుల్, వార్డెన్, ఫైర్‌మెన్‌ పోస్టులకు ఈ నెల 12 నుంచి డిసెంబర్‌ 7 వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

అభ్యర్థి వయస్సు ధృవీకరణ, విద్యార్హత, శరీర కొలతలకు సంబంధించి ధృవపత్రాలు దరఖాస్తుతోపాటు ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, ఫైర్‌ ఆఫీసర్, డిప్యూటీ జైలర్‌ పోస్టులకు ఓసీ, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.300 వంతున ఫీజు చెల్లించాలి. వీరికి డిసెంబర్‌ 16వ తేదీ ప్రాథమిక పరీక్ష ఉంటుంది. పోలీస్‌ కానిస్టేబుల్, వార్డర్, ఫైర్‌మెన్‌ పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ పోస్టులకు రూ.150 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

వీరికి 2019 జనవరి 6న ప్రాథమిక పరీక్ష ఉంటుంది. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎస్‌ఐ(సివిల్‌) 150, ఆర్‌ఎస్‌ఐ(ఏఆర్‌) 75, ఆర్‌ఎస్‌ఐ(ఏపీఎస్‌పీ) 75, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ 20, డిప్యూటీ జైలర్‌(మెన్‌) 10, డిప్యూటీ జైలర్‌(ఉమెన్‌) 4, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ 50, పోలీస్‌ కానిస్టేబుల్‌(సివిల్‌) 1600, కానిస్టేబుల్‌(ఏఆర్‌) 300, పోలీస్‌ కానిస్టేబుల్‌(ఏపీఎస్‌పీ) 300, వార్డర్‌(మేల్‌) 100, వార్డర్‌(ఉమెన్‌) 23, ఫైర్‌మెన్‌ 400, డ్రైవర్‌ ఆపరేటర్స్‌ 30 పోస్టులు ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top