
బెంగళూరు కంపెనీ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న యువతి నివసిస్తున్న భవనం
విజయనగరం టౌన్: గరివిడి మండలంలోని శేరీపేటలో బుల్లెట్ ఓర్ మైనింగ్ వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన బెంగళూరు కంపెనీ నిర్వహకురాలు, కార్యకలాపాలపై జిల్లా ఎస్‌పీ జి.పాలరాజు దృష్టి సారించారు. బుల్లెట్‌ఓర్ తవ్వకాలపై సాక్షి ప్రచురిస్తున్న వరుస కథనాలపై ఎస్పీ స్పందించారు. బుల్లెట్‌రాణి ఎవరు? ఆమె కార్యకలాపాలు ఏమిటి? ఆమె వెనుక ఎవరున్నారు అనే కోణంలో పరిశోధనలు జరిపి నివేదిక ఇవ్వాలని స్పెషల్‌బ్రాంచ్ పోలీస్ అధికారులను ఆదేశించినట్లు ఎస్పీ పాలరాజు సాక్షికి వెల్లడించారు.