పంటపొలాలను తగలబెట్టిన కేసు క్లోజ్‌ | Police Closed To Amravati Crop Fields Fire Case | Sakshi
Sakshi News home page

Nov 19 2018 2:04 PM | Updated on Nov 19 2018 8:10 PM

Police Closed To Amravati Crop Fields Fire Case - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాజధాని పంటపొలాలను తగలబెట్టిన కేసును పోలీసులు సోమవారం మూసేశారు. గుర్తు తెలియని దుండగులు 2014 డిసెంబర్‌ 29 రాత్రి తుళ్లురు, తాడేపల్లి మండలాల్లోని 13 చోట్ల పంట పొలాలను తగలబెట్టారు. ఆ సమయంలో పొలాల్లో మంటలు ఆరకముందే ఇది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టే చేసిన పనేనంటూ అధికార పార్టీ నేతలు విష ప్రచారం చేశారు. ఈ కేసుతో రాజధానికి భూములు ఇవ్వని రైతులను టార్గెట్‌ చేసి పోలీసులతో వేధించారు. ఈ వేధింపులు తట్టుకోలేని రైతులు రాజధానికి పొలాలు ఇచ్చేశారు.

నాలుగేళ్లుగా విచారించిన పోలీసులు తీరా ఇప్పుడు నిందితులను కనిపెట్టలేకపోయామంటూ కేసును క్లోజ్‌ చేశారు. ఈ కేసు మూసివేయడంపై అభ్యంతరాలుంటే వారం రోజుల్లోపు కోర్టుకు చెప్పుకోవచ్చని రైతులకు నోటీసులిచ్చారు. మరోవైపు ఇలా కేసు మూసేయడంపై రైతులు మండిపడుతున్నారు. విచారణ పేరుతో తమను చిత్రహింసలు పెట్టిన పోలీసులు.. నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement