విశాఖలో ప్రధాని మోదీ 20 కిలోమీటర్ల రోడ్‌షో | PM Modi 20 km roadshow in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో ప్రధాని మోదీ 20 కిలోమీటర్ల రోడ్‌షో

Jun 3 2017 1:38 AM | Updated on Mar 29 2019 9:31 PM

విశాఖలో ప్రధాని మోదీ 20 కిలోమీటర్ల రోడ్‌షో - Sakshi

విశాఖలో ప్రధాని మోదీ 20 కిలోమీటర్ల రోడ్‌షో

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే నెల 15న విశాఖ రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరంలో భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు.

జూలై 15, 16 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే నెల 15న విశాఖ రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరంలో భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. నగరంలోని ఐఎన్‌ఎస్‌ డేగా (నావీ ఎయిర్‌పోర్టు) నుంచి సమావేశాలు జరుగనున్న వేదిక వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో సాగనుంది. రోడ్‌షో రూట్‌ మ్యాప్‌తో పాటు సమావేశాల నిర్వహణ, వేదిక ఖరారుపై చర్చించేందుకు శుక్రవారం రాత్రి బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కె.హరిబాబు అధ్యక్షతన విశాఖలో భేటీ అయ్యింది.

జూలై 15, 16 తేదీల్లో విశాఖ వేదికగా జరుగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా 14న విశాఖకు రానున్నారు. 15న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు చేరుకుంటారు. 14న అమిత్‌షా, 15న నరేంద్ర మోదీ రోడ్‌షోలు నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందించారు. కాగా జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు, 40 మందికి పైగా కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలంతా విశాఖ రానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement