మిజోరం సీఎంగా లాల్దుహోమా ప్రమాణ స్వీకారం | Sakshi
Sakshi News home page

మిజోరం సీఎంగా లాల్దుహోమా ప్రమాణ స్వీకారం

Published Fri, Dec 8 2023 2:46 PM

Lalduhoma Takes Oath As Mizoram Chief Minister - Sakshi

ఐజ్వాల్‌: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (జెడ్‌ఎన్‌పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం జెడ్‌ఎన్‌పీ అధినేత లాల్దుహోమా చేత ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర గవర్నర్‌ కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మిజోరంలో భారీ విజయం సాధించిన జెడ్‌ఎన్‌పీ నూతన ప్రభుత్వం నేడు కొలువుదీరింది.


నవంబర్‌ 7న జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాల్లో జోరామ్‌ నేషనలిస్ట్‌ పార్టీ 27 స్థానాల్లో ఘన విజయం సాధించింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది.

Advertisement
 
Advertisement