‘పిల్లా నువ్వు లేని జీవితం’ సందడే సందడి | Pilla nuvvu leni jeevitham unit members hungama in district | Sakshi
Sakshi News home page

‘పిల్లా నువ్వు లేని జీవితం’ సందడే సందడి

Nov 23 2014 1:57 AM | Updated on Sep 2 2017 4:56 PM

‘పిల్లా నువ్వు లేని జీవితం’ సందడే సందడి

‘పిల్లా నువ్వు లేని జీవితం’ సందడే సందడి

అనకాపల్లి పట్టణంలోని సత్యసాయి, పర్తిసాయి థియేటర్లలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రం యూనిట్ శనివారం సందడి చేసింది.

అనకాపల్లి రూరల్  : అనకాపల్లి పట్టణంలోని సత్యసాయి, పర్తిసాయి థియేటర్లలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రం యూనిట్ శనివారం సందడి చేసింది. మధ్యాహ్నం ఆట సమయంలో వచ్చిన యూనిట్ బృందం సినిమా డైలాగ్‌లు చెపుతూ ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. ఈ సందర్భంగా హీరో సాయి ధరమ్‌తేజ్ మాట్లాడుతూ తన మొదటి చిత్రాన్ని పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ ప్రేక్షకదేవుళ్లకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తన తదుపరి చిత్రం హరీష్ శంకర్ డెరైక్షన్‌లోసాయి ధరమ్‌తేజ్ హీరోగా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కేరింత సినిమా నిర్మిస్తున్నామన్నారు. దర్శకుడు రవికుమార్ చౌదరి, నటి హేమ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement