నాయకులు వేధిస్తున్నారు | Peoples Are Suffering With Drinking Water Problem | Sakshi
Sakshi News home page

నాయకులు వేధిస్తున్నారు

Mar 6 2018 10:02 AM | Updated on Jul 25 2018 5:35 PM

Peoples Are Suffering With Drinking Water Problem - Sakshi

ఉలవపాడు : తనకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడమే కాకుండా వేధిస్తున్నారని నాగులపాడు గ్రామానికి చెందిన యరజర్ల శేషమ్మ జగన్‌ ఎదుట వాపోయింది. తన పాత ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడంలేదని,  నూతన గృహం నిర్మించుకోవడానికి గృహాన్ని మంజూరు చేయడం లేదని విన్నవించింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరింది. – యరజర్ల శేషమ్మ

గుండెలో చిల్లు ఇబ్బంది పెడుతుందయ్యా...
ఉలవపాడు: చిన్న వయసులో ఉన్న తన కుమారుడికి గుండెలో చిల్లు ఉందని, వైద్యం చేయిం చుకునే పరిస్థితి లేదని నాగులపాడు గ్రామానికి చెందిన అనూష జగన్‌ను కలసి విన్నవించింది. ఆరోగ్య శ్రీ ఉపయోగపడడం లేదని తెలిపింది. తమ సమస్యను పరిష్కరించాలని కోరింది. – అనూష

తాగునీటికి తంటాలు పడుతున్నాం
కందుకూరు రూరల్‌: తమ కాలనీలో తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నామని నాగులపాడుకు చెందిన కంచర్ల రజినీ వైఎస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదని మీరైనా మా కాలనీకు మంచినీరు అందించాలని వేడుకుంది. – కంచర్ల రజినీ, నాగులపాడు

Advertisement
 
Advertisement
Advertisement