సామాజిక పింఛన్‌దారులు పింఛన్ కోసం ఆందోళనకు దిగారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో సోమవారం చోటుచేసుకుంది.
తంబళ్లపల్లి (చిత్తూరు) : సామాజిక పింఛన్‌దారులు పింఛన్ కోసం ఆందోళనకు దిగారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని లబ్ధిదారులు ఈ రోజు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
సాంకేతిక కారణాలు చూపుతూ వితంతు, వృద్ధాప్య, వికలాంగు పింఛన్లను ఇప్పటివరకు అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో పింఛన్‌దారులంతా కలసి ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సకాలంలో పింఛన్ పంపిణీ చేసి ఆదుకోవాలని వారు కోరారు.