కేసీఆర్లా బాబు మాటమారిస్తే ఒప్పుకోం | Peddireddy Ramachandra Reddy takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

కేసీఆర్లా బాబు మాటమారిస్తే ఒప్పుకోం

Jun 8 2014 11:52 AM | Updated on May 25 2018 9:17 PM

కేసీఆర్లా బాబు మాటమారిస్తే ఒప్పుకోం - Sakshi

కేసీఆర్లా బాబు మాటమారిస్తే ఒప్పుకోం

రైతు రుణమాఫీ హామీని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

రైతు రుణమాఫీ హామీని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లా చంద్రబాబు మాటమారిస్తే ఒప్పుకోమని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. అలా కాకుంటే తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చంద్రబాబు నాయుడిని రామచంద్రారెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా నేటి రాత్రి ప్రమాణ స్వీకారం చేయున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం రైతుల రుణమాఫీ దస్త్రంపై సంతకం చేస్తానని ప్రకటించి సంగతి తెలిసిందే.

 

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తానని ఎన్నిక ముందు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎం పీఠం ఎక్కిన తర్వాత కేసీఆర్ మాట మార్చారు. కేవలం రూ. లక్ష మాత్రమే రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. దాంతో కేసీఆర్ ప్రకటనపై తెలంగాణ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా కేసీఆర్ అడుగుజాడల్లో నడిస్తే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement