Punganur mla
-
నా గురించి మాట్లాడేందుకు జలీల్‌ఖాన్ ఎవరు?
పుంగనూరు: ‘నా గురించి మాట్లాడేందుకు జలీల్‌ఖాన్ ఎవరు? ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ చెబితే పార్టీలు మారుతామా! టీడీపీ ఆఫీస్‌లో పనీపాట లేకుండా మాట్లాడే వారికి నేను సమాధానం ఇవ్వాలా? నాకూ వ్యక్తిత్వం ఉంది. దానిపైనే నడుస్తా’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం పుంగనూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల తరువాత శాసనసభాపక్ష సమావేశంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలోనే పార్టీ మారబోనని స్పష్టం చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలను రకరకాల ప్రలోభాలకు గురిచేసి, పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాభిమానంతో పదవులు పొందే వారికి శాశ్వత గుర్తింపు ఉంటుందన్నారు. డబ్బులు, అధికారం కోసం పార్టీలు మారే వారి రాజకీయ భవిష్యత్తు ప్రశార్థకమేనని, మనుగడ ఉండదన్నారు. రాష్ట్రంలో టీడీపీ సర్కారు పాలనలో విఫలమైందని, రెండేళ్ల కాలంలోనే ప్రజల మన్ననలు కోల్పోయిందన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఖర్చుచేసిన డబ్బు జమ చేసుకునేందుకు రకరకాల ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం లూటీ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు, మంత్రిమండలికి నూతన రాజధాని నిర్మాణంలో ఉన్న ఉత్సాహం ప్రజల సంక్షేమ పథకాల అమలులో కనిపించలేదన్నారు. ఇంకుడు గుంతల తవ్వకం పనికిరాని కార్యక్రమమని విమర్శించారు. చెరువులు, ప్రాజెక్టుల పనులు చేపట్టి వాటిని బలోపేతం చేస్తే వర్షపు నీటిని నిలువ చేయవచ్చని చెప్పారు. -
పుంగనూరు దాహార్తి తీరుస్తా
సోమల: ఎన్ని అడ్డంకులు ఎదురైనా పుంగనూరు దాహార్తి తీరుస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమల మండల పర్యటనలో భాగం గా మంగళవారం శీలయ్యగారిపల్లె నుంచి 26 గ్రామాల మీదుగా ఎస్.నడింపల్లె వరకు సాగింది. నంజంపేటలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి పేద లకోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల మంజూరు, భూ పంపి ణీ, జలయజ్ఙం, తాగునీటి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. కేవలం టీడీపీ కార్యకర్తల లబ్ధి కోసం ఆదర్శ రైతు వ్యవస్థను నాశనం చేసిందని తెలిపారు. పరిశీలన పేరుతో మండలంలో వేలా ది మందికి పింఛన్లు తొలగించారని విమర్శించారు. పొదలకుంట్లపల్లె వద్ద మాట్లాడుతూ కొర్లకుంట ప్రాజె క్టు పనులు పూర్తిచేసి పుంగనూరు, చౌడేపల్లె, సోమల మండలాల్లో నీటి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. రైతుల కోసమే కాలువ అను సంధానం సోమల మండలం మల్లీశ్వరపురం గ్రామం వద్ద ఉన్న గార్గేయనది నుంచి సదుం మండలం ఎర్రాతివారిపల్లె గ్రామం వరకు 18 కిలోమీటర్ల మేర కాలువ అనుసంధానం చేసి చిన్న ఉప్పరపల్లె, పొదలకుంట్లపల్లె, నంజంపేట, సదుం మండలంలోని జోగివారిపల్లె, చెరుకువారిపల్లె, నడిగడ్డ, ఎర్రాతివారిపల్లె పంచాయతీల్లో సాగునీటి ఇబ్బందులు తొలగించా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పార్టీ మం డలాధ్యక్షుడు గంగాధరం రాయల్, మాహిళాధ్యక్షురాలు ఝూన్సీలక్ష్మి, మార్కె ట్ కమిటీ మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, సర్పంచ్‌లు పోకల తులసీరాం, రమాదేవి, శ్రీరాములు, సుజాత, ఎంపీటీసీ సభ్యులు రంగానాయకులు, వసంతమ్మ, మాజీ సర్పంచ్‌లు మునస్వామి, వాసుదేవరెడ్డి, ఖయ్యీంబాషా పాల్గొన్నారు. -
కేసీఆర్‌లా బాబు మాటమారిస్తే ఒప్పుకోం
రైతు రుణమాఫీ హామీని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లా చంద్రబాబు మాటమారిస్తే ఒప్పుకోమని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. అలా కాకుంటే తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చంద్రబాబు నాయుడిని రామచంద్రారెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా నేటి రాత్రి ప్రమాణ స్వీకారం చేయున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం రైతుల రుణమాఫీ దస్త్రంపై సంతకం చేస్తానని ప్రకటించి సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తానని ఎన్నిక ముందు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎం పీఠం ఎక్కిన తర్వాత కేసీఆర్ మాట మార్చారు. కేవలం రూ. లక్ష మాత్రమే రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. దాంతో కేసీఆర్ ప్రకటనపై తెలంగాణ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా కేసీఆర్ అడుగుజాడల్లో నడిస్తే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు.