
పుంగనూరు దాహార్తి తీరుస్తా
ఎన్ని అడ్డంకులు ఎదురైనా పుంగనూరు దాహార్తి తీరుస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
సోమల: ఎన్ని అడ్డంకులు ఎదురైనా పుంగనూరు దాహార్తి తీరుస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమల మండల పర్యటనలో భాగం గా మంగళవారం శీలయ్యగారిపల్లె నుంచి 26 గ్రామాల మీదుగా ఎస్.నడింపల్లె వరకు సాగింది. నంజంపేటలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి పేద లకోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల మంజూరు, భూ పంపి ణీ, జలయజ్ఙం, తాగునీటి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.
కేవలం టీడీపీ కార్యకర్తల లబ్ధి కోసం ఆదర్శ రైతు వ్యవస్థను నాశనం చేసిందని తెలిపారు. పరిశీలన పేరుతో మండలంలో వేలా ది మందికి పింఛన్లు తొలగించారని విమర్శించారు. పొదలకుంట్లపల్లె వద్ద మాట్లాడుతూ కొర్లకుంట ప్రాజె క్టు పనులు పూర్తిచేసి పుంగనూరు, చౌడేపల్లె, సోమల మండలాల్లో నీటి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు.
రైతుల కోసమే కాలువ అను సంధానం
సోమల మండలం మల్లీశ్వరపురం గ్రామం వద్ద ఉన్న గార్గేయనది నుంచి సదుం మండలం ఎర్రాతివారిపల్లె గ్రామం వరకు 18 కిలోమీటర్ల మేర కాలువ అనుసంధానం చేసి చిన్న ఉప్పరపల్లె, పొదలకుంట్లపల్లె, నంజంపేట, సదుం మండలంలోని జోగివారిపల్లె, చెరుకువారిపల్లె, నడిగడ్డ, ఎర్రాతివారిపల్లె పంచాయతీల్లో సాగునీటి ఇబ్బందులు తొలగించా మని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీడీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పార్టీ మం డలాధ్యక్షుడు గంగాధరం రాయల్, మాహిళాధ్యక్షురాలు ఝూన్సీలక్ష్మి, మార్కె ట్ కమిటీ మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, సర్పంచ్‌లు పోకల తులసీరాం, రమాదేవి, శ్రీరాములు, సుజాత, ఎంపీటీసీ సభ్యులు రంగానాయకులు, వసంతమ్మ, మాజీ సర్పంచ్‌లు మునస్వామి, వాసుదేవరెడ్డి, ఖయ్యీంబాషా పాల్గొన్నారు.