సాయంత్రం విశాఖలో పవన్ పర్యటన | pawan kalyan starts to visakhapatnam | Sakshi
Sakshi News home page

సాయంత్రం విశాఖలో పవన్ పర్యటన

Oct 15 2014 10:49 AM | Updated on Mar 22 2019 5:33 PM

సాయంత్రం విశాఖలో పవన్ పర్యటన - Sakshi

సాయంత్రం విశాఖలో పవన్ పర్యటన

సినీహీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖ బయల్దేరారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు.

హైదరాబాద్ : సినీహీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖ బయల్దేరారు. ఈరోజు సాయంత్రం ఆయన విశాఖలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా పవన్ పర్యటిస్తారు. కాగా హుదూద్ బాధితులకు పవన్ కళ్యాణ్ నిన్న రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం సహాయ నిధికి ఆయన ఈ విరాళాన్ని అందించనున్నారు. మరోవైపు తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement