సంబరానికి.. నేడే ఆరంభం | Party .. Beginning today | Sakshi
Sakshi News home page

సంబరానికి.. నేడే ఆరంభం

Oct 21 2013 6:32 AM | Updated on Sep 1 2017 11:50 PM

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారికి ఏటా నిర్వహించే జాతర మహోత్సవంలో కీలకమైనది తొలేళ్లు ఉత్సవం.

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారికి ఏటా నిర్వహించే జాతర మహోత్సవంలో కీలకమైనది తొలేళ్లు ఉత్సవం. సోమవారం తొలేళ్ల ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే ఈ జాతరకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పక్కనే ఉన్న ఒడిశా నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివ స్తారు. తొలేళ్ల ఉత్సవాన్ని ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారు లు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
 అదేవిధంగా మరునాడు మంగళవారం  అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఉత్సవ ఏర్పాట్లను కలెక్టర్ కాంతిలాల్‌దండే, జాయింట్ కలెక్టర్ పి.ఎ.శోభతో పాటు ఇతర అధికారులు ఆదివారం పరిశీలించారు. తొలేళ్ల  ఉత్సవంలో భాగంగా మహారాజుల ఆడపడుచైన పైడితల్లమ్మకు రాజవంశీయులు పసుపు కుంకుమ, పట్టు చీర,గాజులను అందచేస్తారు. అమ్మవారికి అందచేసే వస్తువులను రాజవంశీ యులు  పల్లకిలో ఉంచి  కోటనుంచి మేళతాళా లు, డప్పువాయిద్యాలు, పులివేషాలతో ఊరేగింపుగా మూడులాంతర్ల వద్ద ఉన్న చదురు గుడికి చేరుకుంటారు. 
 
 అక్కడ వేద పండితుల ఆశీర్వచనాలతో అమ్మవారికి వాటిని అందచేస్తారు. రాత్రి ఘటాలతో ఊరేగింపుగా కోటకు చేరుకుని కోటశక్తికి పూజలు చేస్తారు. తిరిగి ఘటాలతో అమ్మవారి ఆలయానికి వస్తారు. తల్లి ఘటాలుగా వ్యవహరించే వాటిని ఆల యం ఎదురుగా ఎత్తుగా వేసిన బల్లలపై ఉంచుతారు.సిరిమానును అధిరోహించే ఆలయ పూజారి ఆ ఘటాలకెదురుగా నిలబడి పైడితల్ల మ్మ వారి వృత్తాంతాన్ని చెబుతారు.అమ్మవారి ప్రతిరూపంగా భావించే ఆలయపూజారి చేతులమీదుగా విత్తనాలను అందుకునేందుకు పరిసర గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు. పూజారి చేతులమీదుగా అందుకునే విత్తనాలను వేసి భూమిని దున్నితే పంటలు బాగా పండుతాయ ని రైతుల విశ్వాసం. తొలి విత్తనాన్ని పంటకు ఉపయోగించడం వల్ల దీన్ని తొలేళ్లు ఉత్సవంగా వ్యవహరిస్తున్నారు. 
 
 తొలేళ్లరోజు  చదురుగుడి, వనంగుడిల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.   
 తగ్గనున్న ఉత్సవ సందడి?   
 ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తు లు పట్టణానికి తరలివస్తారు. ప్రారంభ ఘట్టా న్ని తిలకించిన అనంతరం పట్టణంలో ఏర్పా టు చేసే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించే భక్తులతో ఆ రాత్రంతా పట్టణంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఇది ప్రతి ఏడాదీ ఉత్సవం జరిగే తీరు. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారా యి. పట్టణంలో పక్షం రోజుల క్రితం జరిగిన అల్లర్ల నేపథ్యంలో జిల్లా  పోలీస్ యంత్రాంగం   ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేస్తుండడంతో  ఆ సందడి కనిపించదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక వేళ భక్తులను రాత్రంతా సంచరించేందుకు అనుమతించినా భక్తుల కంటే  పోలీసు బలగాలు ఎక్కువ సంఖ్యలో  పహారా కాసే పరిస్థితి ఉండడంతో  ఈ ఏడాది ఉత్సవ సందడి తగ్గేఅవకాశాలు మెండుగా ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది.  వాస్తవానికి గత కొద్ది సంవత్సరాల అధికారుల లెక్కలను పరిశీలిస్తే సుమారు మూడు లక్షల మంది భక్తులు అమ్మవారి జాతరలో పాలుపంచుకున్నారు. అయితే ఈ సంఖ్య గణనీయంగా పడిపోయే  ఆస్కారం ఉందని పలువురు అధికారులే చెప్పుకుంటుండడం గమనార్హం.   
 
 సంగీత కళాశాలలో ఎగ్జిబిషన్ ఏర్పాటు 
 జాతర సందర్భంగా పట్టణానికి వచ్చే భక్తుల సందర్శనార్థం ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సంగీత కళాశాల ఆవరణలో వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఎగ్జిబిషన్‌లో సాండ్ కార్విం గ్, ఐస్ కార్వింగ్, వెజిటబుల్ కార్వింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా సందర్శకులను ఆకట్టుకునే విధంగా నిర్వాహకులు రూపొందిస్తున్నారు.  ఈనెల 21, 22, 23 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు భక్తుల సందర్శనకు అనుమతినిచ్చే ఎగ్జిబిషన్‌కు వ్యవసా య, మత్స్య, పశుసంవర్థక, ఇరిగేషన్, చేనేత జౌళి శాఖల నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement